
న్యూఢిల్లీ: డెన్మార్క్ ఓపెన్ బరిలో నిలిచిన ఇండియా స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్ కు స్పోర్స్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్ ) గుడ్ న్యూస్ చెప్పింది. శ్రీకాంత్ రిక్వెస్ట్ ను మన్నించిన సాయ్ .. తెలుగు షట్లర్ తన పర్సనల్ కోచ్, ఫిజియోథెరపిస్ట్‌తో కలిసి డెన్మార్క్ వెళ్లేందుకు అనుమతిచ్చింది. శ్రీకాంత్ టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ లో ఉండడం వల్లే సాయ్ సానుకూలంగా స్పందించింది. దీంతో శ్రీకాంత్ తన టీమ్ తో కలిసి కాస్త ముందుగానే డెన్మా ర్క్ వెళ్లనున్నాడు. అయితే, శ్రీకాంత్ వెంట వెళ్లే సిబ్బంది పేర్లను సాయ్ ప్రకటించలేదు. కాగా, శ్రీకాంత్ తోపాటు అతని సపోర్ట్ స్టాఫ్ కు అయ్యే కరోనా టెస్ట్‌ల ఖర్చును కూడా సాయ్ భరించనుంది. అక్టోబర్ 13 నుంచి ఒడెన్స్ వేదికగా డెన్మార్క్ ఓపెన్ జరగనుంది.