ఫీడర్‌‌‌‌‌‌‌‌ సిరీస్‌‌‌‌‌‌‌‌ చాంప్‌‌‌‌‌‌‌‌ సత్యన్‌‌‌‌‌‌‌‌

ఫీడర్‌‌‌‌‌‌‌‌ సిరీస్‌‌‌‌‌‌‌‌ చాంప్‌‌‌‌‌‌‌‌ సత్యన్‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ: ఇండియా స్టార్‌‌‌‌‌‌‌‌ ప్లేయర్‌‌‌‌‌‌‌‌ జి. సత్యన్‌‌‌‌‌‌‌‌.. తొలిసారి డబ్ల్యూటీటీ ఫీడర్‌‌‌‌‌‌‌‌ సిరీస్‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌గా నిలిచాడు. లెబనాన్‌‌‌‌‌‌‌‌లోని బైరూట్‌‌‌‌‌‌‌‌లో గురువారం అర్ధరాత్రి జరిగిన మెన్స్‌‌‌‌‌‌‌‌ సింగిల్స్‌‌‌‌‌‌‌‌ ఫైనల్లో సత్యన్‌‌‌‌‌‌‌‌ 6–11, 11–7, 11–7, 11–4తో మానవ్‌‌‌‌‌‌‌‌ ఠక్కర్‌‌‌‌‌‌‌‌పై గెలిచాడు. దీంతో ఈ టైటిల్‌‌‌‌‌‌‌‌ నెగ్గిన తొలి ఇండియన్‌‌‌‌‌‌‌‌ ప్లేయర్‌‌‌‌‌‌‌‌గా అతను రికార్డులకెక్కాడు. ఐటీటీఎఫ్‌‌‌‌‌‌‌‌ కేటగిరీలో చివరిసారి 2021 చెక్‌‌‌‌‌‌‌‌ ఇంటర్నేషనల్‌‌‌‌‌‌‌‌ ఓపెన్‌‌‌‌‌‌‌‌ నెగ్గిన సత్యన్‌‌‌‌‌‌‌‌కు డబ్ల్యూటీటీలో ఇదే తొలి టైటిల్‌‌‌‌‌‌‌‌ కావడం విశేషం. ఫైనల్‌‌‌‌‌‌‌‌ చేరే క్రమంలో సత్యన్‌‌‌‌‌‌‌‌ 15–13, 6–11, 11–8, 13–11తో హర్మీత్‌‌‌‌‌‌‌‌ దేశాయ్‌‌‌‌‌‌‌‌ని, 11–8, 11–13, 11–8, 11–9తో చుయాంగ్‌‌‌‌‌‌‌‌ చిమ్‌‌‌‌‌‌‌‌ యువాన్‌‌‌‌‌‌‌‌ను ఓడించాడు.  మిక్స్‌‌‌‌‌‌‌‌డ్‌‌‌‌‌‌‌‌ ఫైనల్లో దియా చిటాలె–మానుష్‌‌‌‌‌‌‌‌ షా 3–1తో మానవ్‌‌‌‌‌‌‌‌–ఆర్చన కామత్‌‌‌‌‌‌‌‌పై నెగ్గారు.