FIH విమెన్స్ నేషన్స్ కప్ హాకీ టోర్నీలో: సెమీస్లో ఇండియా

FIH  విమెన్స్ నేషన్స్ కప్ హాకీ టోర్నీలో: సెమీస్లో ఇండియా

ఆక్లాండ్: ఎఫ్‌‌ఐహెచ్ విమెన్స్ నేషన్స్ కప్ హాకీ టోర్నీలో ఇండియా సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన పూల్‌‌–ఎ మూడో మ్యాచ్‌‌లో ఇండియా 3–-2 తేడాతో ఉరుగ్వేపై గెలిచి హ్యాట్రిక్‌‌ విజయాలను నమోదు చేసింది. ఫలితంగా ఈ గ్రూప్‌‌లో టాప్‌‌ ప్లేస్‌‌ను సొంతం చేసుకుంది.

దీపిక (24, 56వ ని), దీపిక సోరెంగ్‌‌ (43వ ని) ఇండియాకు గోల్స్‌‌ అందించగా, ఉరుగ్వే తరఫున కియారా అపెన్నినో (13వ ని), మాన్యులా విలార్‌‌ (55వ ని) గోల్స్‌‌ చేశారు. ఆట ప్రారంభం నుంచి డ్రాగ్‌‌ ఫ్లికర్‌‌ దీపిక ప్రత్యర్థి డిఫెన్స్‌‌పై విరుచుకుపడింది. దాంతో తడబడిన ఉరుగ్వే ప్లేయర్లు పెనాల్టీలను సమర్పించుకున్నారు.

వీటిని ఇండియా సమర్థవంతంగా గోల్స్‌‌గా మలిచింది. ఈ మ్యాచ్‌‌ ద్వారా నేహా ఇంటర్నేషనల్‌‌ కెరీర్‌‌లో 200వ మ్యాచ్‌‌ ఆడి సరికొత్త మైలురాయిని అందుకుంది. ఇక రెండో ప్లేస్‌‌లో నిలిచిన అమెరికా కూడా సెమీస్‌‌ బెర్త్‌‌ను ఖాయం చేసుకుంది.