యునానీలో ఇండియా టాప్

యునానీలో ఇండియా టాప్

    కేంద్ర ఆయుష్‌‌‌‌ మంత్రి  శ్రీపాద్‌‌‌‌ యశో నాయక్‌‌‌‌

    మెడిసిన్ ఫర్ స్కిన్ డిజార్డర్స్ సెంటర్ ప్రారంభం

    యునానీకి హైదరాబాద్ పెట్టింది పేరు: కిషన్‌‌‌‌రెడ్డి

హైదరాబాద్, వెలుగు: యునానీ మెడిసిన్‌‌‌‌లో భారత్ ముందుందని కేంద్ర ఆయుష్ మంత్రి శ్రీపాద్‌‌‌‌ యశోనాయక్ అన్నారు. చాలా జబ్బులకు యునానీలో చికిత్సలున్నాయని, సద్వినియోగం చేసుకోవాలని ప్రజలను కోరారు. హైదరాబాద్‌‌‌‌లోని ఆయుర్వేద కళాశాలలో నేషనల్ రీసెర్చ్ ఇన్‌‌‌‌స్టిట్యూట్ ఆఫ్ యూనానీ మెడిసిన్ ఫర్ స్కిన్ డిజార్డర్స్‌‌‌‌ను ఆదివారం మంత్రి ప్రారంభించారు. బొల్లి సహా కొన్ని దీర్ఘకాలిక రోగాలకు యునానీనే సరైన చికిత్స అన్నారు. లక్షా 50 వేల మంది బొల్లి రోగులకు యునానీ చికిత్సతో నయమైందన్నారు. ఈ వైద్యానికి ప్రధాని మోడీ ప్రాధాన్యం ఇస్తున్నారని, ఇందులో మరిన్ని పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందన్నారు. భారత సంస్కృతిలో యునానీ భాగమని కేంద్ర హోంశాఖ మంత్రి కిషన్‌‌‌‌రెడ్డి అన్నారు. ఈ వైద్యంలో హైదరాబాద్‌‌‌‌కు ఎంతో ప్రత్యేకత ఉందని చెప్పారు. సెంట్రల్ రీసెర్చ్ ఇన్‌‌‌‌స్టిట్యూట్ ఆఫ్ యునానీ మెడిసిన్ హాస్పిటల్‌‌‌‌ను అప్‌‌‌‌గ్రేడ్ చేసినట్లు సెంట్రల్ ఆయుష్ అడిషనల్ సెక్రటరీ ప్రమోద్‌‌‌‌కుమార్ పాఠక్ తెలిపారు.