IND vs AUS U19 WC: మరి కొన్ని గంటల్లో ఫైనల్ మ్యాచ్..లైవ్ స్ట్రీమింగ్ ఎందులో చూడాలంటే..?

IND vs AUS U19 WC: మరి కొన్ని గంటల్లో ఫైనల్ మ్యాచ్..లైవ్ స్ట్రీమింగ్ ఎందులో చూడాలంటే..?

అండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–19 వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తుది సమరానికి చేరుకుంది. ఈ టోర్నీలో అద్భుత ప్రదర్శన కనబర్చిన టీమిండియా , ఆస్ట్రేలియా జట్లు ఫైనల్ ఆడేందుకు సిద్ధమయ్యాయి. దక్షిణాఫ్రికా ఆతిధ్యమిస్తున్న ఈ టోర్నీ ఫైనల్ మ్యాచ్ బెనోనిలోని విల్లోమూర్ పార్క్‌లో జరగనుంది. మ్యాచ్ స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 10:00 గంటలకు (బెనోని), భారత కాలమాన ప్రకారం మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభమవుతుంది. 

2016 నుంచి వరుసగా ఫైనల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆడుతున్న ఇండియా 2018, 2022లో టైటిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నెగ్గింది. 2016, 2020లో పరాజయంపాలైంది. లీగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సెమీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తిరుగులేని ఆటతో చెలరేగిన టీమిండియా ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనూ గెలిచి ఆరోసారి టైటిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దాంతో పాటు గతేడాది నవంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 19న ఆసీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సీనియర్ టీమ్‌‌ చేతిలో రోహిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సేనకు ఎదురైన పరాజయానికి కొంతైనా బదులు తీర్చుకోవాలని భావిస్తోంది. మరోవైపు ఆస్ట్రేలియా 2012, 2018 ఫైనల్లో ఇండియా చేతిలో ఎదురైన పరాజయాలకు బదులు తీర్చుకోవాలని ఆస్ట్రేలియా లక్ష్యంగా పెట్టుకుంది. 

ఫైనల్ మ్యాచ్‌ని ఎక్కడ చూడాలి?

స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ (స్టార్ స్పోర్ట్స్ 1 మరియు స్టార్ స్పోర్ట్స్ సెలెక్ట్ 2 ఛానెల్స్)లో మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. ఇండియాలో డిస్నీ+ హాట్‌స్టార్ లో ఆన్‌లైన్ స్ట్రీమింగ్‌ లో ఫ్రీగా చూడొచ్చు.

భారత U19 జట్టు:

ఉదయ్ సహారన్ (కెప్టెన్), ఆదర్శ్ సింగ్, అర్షిన్ కులకర్ణి, ముషీర్ ఖాన్, ప్రియాంషు మోలియా, సచిన్ దాస్, మురుగన్ అభిషేక్, అరవెల్లి అవనీష్ (వికెట్ కీపర్), నమన్ తివారీ, రాజ్ లింబానీ, సౌమీ పాండే, ఆరాధ్య శుక్లా, ధనుష్ గౌడ, రుద్ర పటేల్, ప్రేమ్ దేవ్కర్, మహమ్మద్ అమన్, అన్ష్ గోసాయి.

ALSO READ :- బడ్జెట్ ను విమర్శించే హరీశ్, కేటీఆర్ మూర్ఖులు: కోమటిరెడ్డి

ఆస్ట్రేలియా U19 జట్టు:

హ్యూ వీబ్‌జెన్ (కెప్టెన్ ), హ్యారీ డిక్సన్, సామ్ కాన్స్టాస్, హర్జాస్ సింగ్, ర్యాన్ హిక్స్ (వికెట్ కీపర్), ఆలివర్ పీక్, టామ్ కాంప్‌బెల్, రాఫ్ మాక్‌మిలన్, టామ్ స్ట్రాకర్, మహ్లీ బార్డ్‌మాన్, కల్లమ్ విడ్లర్, లచ్లాన్ ఐట్‌కెన్, చార్లీ ఆండర్సన్, హర్కిరత్ బజ్వా, కోరీ వాస్లీ, ఐడాన్ ఓ కానర్.