V6 News

ఇంగ్లండ్ పై ఇండియా విక్టరీ: సిరీస్ కైవసం

ఇంగ్లండ్ పై ఇండియా విక్టరీ: సిరీస్ కైవసం

ఐసీసీ చాంపియన్‌షిప్‌లో భాగంగా ఇంగ్లండ్‌ మహిళలతో జరిగిన రెండో వన్డేలో ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించిన భారత మహిళల టీం సిరీస్‌ను సొంతం చేసుకుంది. సోమవారం (ఫిబ్రవరి-25) జరిగిన రెండో వన్డేలో గెలిచిన మిథాలీ సేన.. మూడు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే చేజిక్కించుకుంది. 162 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియన్ టీమ్.. మరో 8.5 ఓవర్లు మిగిలి ఉండగానే 3 వికెట్లు కోల్పోయి చేజ్ చేసింది. ఓపెనర్ స్మృతి మందాన వన్డేల్లో 63 పరుగులు చేసి విజయంలో కీలకపాత్ర పోషించింది. కెప్టెన్ మిథాలీ రాజ్ 47 పరుగులతో నాటౌట్‌గా నిలవగా.. పూనత్ రౌత్ 32 పరుగులు చేసింది.

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ మహిళల టీమ్ 43.3 ఓవర్లలో 161 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లండ్ టీమ్‌లో నటాలీ సివర్ మాత్రమే 85 పరుగులు చేసింది. భారత బౌలర్లు ఝులన్ గోస్వామి, శిఖా పాండే చెరో నాలుగు వికెట్లు తీసుకున్నారు.