వైజాగ్ టీ20 : పోరాడి ఓడిన భారత్

వైజాగ్ టీ20 : పోరాడి ఓడిన భారత్

వైజాగ్ : టీ20 సిరీస్ లోఆస్ట్రేలియా బోణి కొట్టింది. విశాఖ మ్యాచ్ లో భారత్ పై 3 వికెట్ల తేడాతో గెలిచింది. ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన పోరులో ఆసీస్ విజయం సాధించింది. భారత బౌలర్లు చివరి వరకు పోరాడిన ఫలితం దక్కలేదు. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 126 రన్స్ చేసింది.

శిఖర్ ధావన్ ప్లేస్ లో జట్టులోకి వచ్చిన కేఎల్ రాహుల్ ఒక్కడే హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. 127 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా..విజయం కోసం చివరి వరకు పోరాడింది. చివరి ఓవర్లో 14 పరుగులు చేయాల్సి ఉండగా..చివరి బంతికి విజయం సాధించింది. గ్లెన్ మ్యాక్స్ వెల్ 43 బంతుల్లో 56 రన్స్ చేసి ఆసీస్ విజయంలో కీరోల్ ప్లే చేశాడు. రెండో టి20 బుధవారం బెంగళూరులో జరుగుతుంది.