39 ఏళ్ల రికార్డు బ్రేక్ చేసిన షమి-బుమ్రా

39 ఏళ్ల రికార్డు బ్రేక్ చేసిన షమి-బుమ్రా
  • 8వ వికెట్ కు బుమ్రా-షమీ రికార్డు భాగస్వామ్యం

లండన్: టెస్టు క్రికెట్ స్వర్గధామం  చారిత్రక లార్డ్స్ మైదానంలో భారత జట్టు మరో రికార్డు బ్రేక్ చేసింది.  ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి ఎదురీదుతూ అటు తర్వాత వారిపై ఆధిపత్యం చెలాయించి మ్యాచ్ ను మలుపుతిప్పిన మహమ్మద్ షమి-బుమ్రాలు 39 ఏళ్ల క్రితం నమోదైన రికార్డును బ్రేక్ చేశారు. 1982లో ఇదే మైదానంలో భారత్ –ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన ఆ మ్యాచ్ లో 9 వికెట్ కు కపిల్ దేవ్ –మదన్ లాల్ ద్వయం 66 పరుగులు చేశారు. 8వ వికెట్ లో ఇప్పటి వరకు ఇదే అత్యుత్తమ స్కోరుగా ఉంది. తాజాగా మహమ్మద్ షమి –బుమ్రాలు 9వ వికెట్ కు అమూల్యమైన 89వ వికెట్ పార్ట్ నర్ షిప్ పరుగులు జోడించడంతో కొత్త రికార్డు నమోదు అయింది. సెకండ్ ఇన్నింగ్స్ లో భారత్ పై పట్టు బిగించిన ఇంగ్లండ్ కబంధ హస్తం నుంచి వీరిద్దరూ ఓపికగా ఆడుతూ.. వారిపై పట్టుసాధించేలా చేశారు.  8వ వికెట్ పార్ట్ నర్ షిప్ లో వీరిద్దరూ 120 బంతులు ఎదుర్కొని 89 పరుగుల భాగస్వామ్యం సాధించారు. 56 పరుగులతో నాటౌట్ గా నిలిచిన మహమ్మద్ షమి 70 బంతులు ఎదుర్కొని ఆరు ఫోర్లు, ఒక సిక్సర్ బాదగా.. బుమ్రా 64 బంతులు ఎదుర్కొని 3 ఫోర్లతో 34 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. దీంతో ఇంగ్లండ్ తో జరుగుతున్న టెస్టులో భారత జట్టు సెకండ్ ఇన్నింగ్స్ లో 298/8 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఇంగ్లండ్ పై 271 పరుగుల ఆధిక్యం చేరుకోగానే డిక్లేర్ చేస్తూ ఇంగ్లండ్ కు 272 పరుగుల టార్గెట్ నిర్దేశించింది. ఇవాళ ఐదో రోజు రెండో ఇన్నింగ్స్ ప్రారంభమైన వెంటనే ఇంగ్లండ్ టపటపా వికెట్లు చేజార్చుకుంటుండంతో భారత్ కు విజయం వైపు పయనిస్తోంది. 
 షమీ-బుమ్రాలకు డ్రస్సింగ్ రూమ్ లో గ్రాండ్ వెల్కమ్
చారిత్రక లార్డ్స్ మైదానంలో 8వ వికెట్ కు రికార్డు భాగస్వామ్యం నెలకొల్పి ఇంగ్లండ్ ఆధిపత్యానన్ని సవాల్ చేసిన మహమ్మద్ షమీ –బుమ్రాలకు డ్రస్సింగ్ రూమ్ లో జట్టు సభ్యుల నుంచి గ్రాండ్ వెల్కమ్ లభించింది. లంచ్ బ్రేక్ టైంకు భారత్ 286/8 పరుగులు చేసింది. కీలక భాగస్వామ్యం నెలకొల్పడంతో జట్టు సభ్యులు ఆనందంతో పొంగిపోయారు. ఇంగ్లండ్ పై పోరాడి దీటుగా బదులిచ్చిన మహమ్మద్ షమీ –బుమ్రాల ఇన్నింగ్స్ చరిత్రలో గుర్తుండిపోతుందని భావిస్తూ బీసీసీఐ సదరు వీడియోతో ట్వీట్ చేసింది. మీరు కూడా చూసేయండి..