ఇండియా, న్యూజిలాండ్ జట్లు టీ20 సిరీస్ కు సిద్ధమయ్యాయి. 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ లో భాగంగా తొలి టీ20 బుధవారం (జనవరి 21) నాగ్‌పూర్ వేదికగా విదర్భ క్రికెట్ అసోసియేషన్ లో జరగనుంది. వన్డే సిరీస్ కోల్పోయిన టీమిండియా కివీస్ పై టీ20ల్లో నెగ్గి ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది. అంతేకాదు స్వదేశంలో జరగనున్న వరల్డ్ కప్ ముందు ఈ సిరీస్ లో గెలిచి ఆత్మవిశ్వాసంతో అడుగుపెట్టాలని చూస్తుంది. మరోవైపు వన్డే సిరీస్ ఇచ్చిన జోష్ తో న్యూజిలాండ్ టీ20 సిరీస్ లోనూ ఇండియాకు షాక్ ఇవ్వాలని గట్టి ప్రయత్నాలు చేస్తుంది. రెండు జట్లు బలంగా ఉండడంతో సిరీస్ హోరాహోరీగా జరగడం ఖాయంగా కనిపిస్తుంది.
వరల్డ్ కప్ ముందు ఇరు జట్లకు ఇదే చివరి సిరీస్. జనవరి 21 నుంచి జనవరి 31 వరకు ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ జరగనుంది. ఇండియాకు సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్సీ చేయనున్నాడు. మరోవైపు న్యూజిలాండ్ జట్టును మిచెల్ సాంట్నర్ లీడ్ చేయనున్నాడు. ఇండియాపై సిరీస్ గెలుచుకున్న కివీస్ ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది. మరోవైపు టీ20 ల్లో తిరుగులేకుండా దూసుకెళ్తున్న టీమిండియా సిరీస్ నెగ్గుతామనే ధీమాగా కనిపిస్తోంది. ఈ సిరీస్ షెడ్యూల్, రెండు జట్ల స్క్వాడ్, లైవ్ స్ట్రీమింగ్, టైమింగ్ వివరాలు ఇప్పుడు చూద్దాం..
లైవ్ స్ట్రీమింగ్, టెలికాస్టింగ్ వివరాలు:
ఐదు టీ20 మ్యాచ్ లు భారత కాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు జరుగుతాయి. అరగంట ముందు అంటే 7:00 గంటలకు టాస్ వేస్తారు.
లైవ్ టెలికాస్ట్: స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్ ఐదు టీ20 మ్యాచ్ లు ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది
లైవ్ స్ట్రీమింగ్: జియో సినిమా యాప్, వెబ్‌సైట్ లో ప్రత్యక్ష ప్రసారం అందుబాటులో ఉంటుంది.
ఇండియా, న్యూజిలాండ్ టీ20 షెడ్యూల్:
బుధవారం (జనవరి 21): తొలి టీ20: విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, నాగ్‌పూర్
శుక్రవారం (జనవరి 23): రెండో టీ20: షహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ స్టేడియం, రాయ్‌పూర్
ఆదివారం (జనవరి 25): మూడో టీ20: బర్సపారా క్రికెట్ స్టేడియం, గౌహతి
బుధవరం (జనవరి 28): నాలుగో టీ 20:వైఎస్ రాజశేఖర రెడ్డి ACA-VDCA క్రికెట్ స్టేడియం, విశాఖపట్నం
శనివారం (జనవరి 31): ఐదో టీ20: గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియం, తిరువనంతపురం
ఇండియా స్క్వాడ్:
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్ (తొలి మూడు టీ20లు), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), రింకు సింగ్, జస్‌ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్, ఇషాన్ కిషాన్
న్యూజిలాండ్ స్క్వాడ్:
మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), మైఖేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్‌మన్, డెవాన్ కాన్వే, జాకబ్ డఫీ, జాక్ ఫౌల్క్స్, మాట్ హెన్రీ, కైల్ జామిసన్, బెవాన్ జాకబ్స్, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రాచిన్ రవీంద్ర, టిమ్ రాబిన్సన్, ఇష్ సోధి
