IND vs PAK బ్లాక్​బస్టర్​ ఫైట్.. వరల్డ్ కప్లో ఇవాళ భారత్, పాక్ మ్యాచ్

IND vs PAK  బ్లాక్​బస్టర్​ ఫైట్.. వరల్డ్ కప్లో ఇవాళ భారత్, పాక్ మ్యాచ్
  • ఫేవరెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా రోహిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సేన     మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వాన ముప్పు
  •  మ. 2 నుంచి స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, డీడీ స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో

అహ్మదాబాద్‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: వన్డే వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చేసింది. మెగా టోర్నీ మజాను మరో లెవెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తీసుకెళ్లి..  క్రికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అసలు సిసలు కిక్​ ఇచ్చే పోరాటానికి రంగం సిద్ధమైంది. కప్పుకే కళ తెచ్చే  చిరకాల ప్రత్యర్థులు ఇండియా–పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మధ్య మెగా మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. నరేంద్ర మోదీ స్టేడియంలో శనివారం జరగనుంది.  ఇందులో  రోహిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌శర్మ కెప్టెన్సీలోని టీమిండియా ఫేవరెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా బరిలోకి దిగుతోంది. తొలిపోరులోనే ఐదుసార్లు చాంపియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆస్ట్రేలియాను పడగొట్టి రెండో మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అఫ్గానిస్తాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను చిత్తుగా ఓడించిన హోమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జోష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉంది. మెగా టోర్నీలో రికార్డు సెంచరీతో కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రోహిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శర్మ, వరుస ఫిఫ్టీలతో  విరాట్ కోహ్లీతో పాటు కేఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాహుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బుమ్రా, కుల్దీప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సిరాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సూపర్ ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్నారు. అదే జోరుతో వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఓటమి లేని రికార్డును కొనసాగించాలని టీమిండియా కోరుకుంటోంది. మరోవైపు శ్రీలంకపై రికార్డు ఛేజింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో దుమ్మురేపిన పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. రోహిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సేనకు వారి స్వదేశంలో ధమ్కీ ఇచ్చి మెగా టోర్నీలో సరికొత్త రికార్డు సృష్టించాలని ఆశిస్తోంది. ఇంకోవైపు తమ జట్టే గెలవాలంటూ  ఆభిమానులు దాయాదుల మధ్య హోరాహోరీ పోరాటాన్ని కోరుకుంటున్నారు. కానీ, ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వాన ముప్పు పొంచి ఉండటమే కాస్త ఆందోళన కలిగిస్తోంది.

గిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. షాహీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ముప్పు

మెగా మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ముందు టీమిండియాకు గుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న్యూస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. డెంగీ కారణంగా తొలి రెండు మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు దూరంగా ఉన్న ఓపెనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గిల్ బరిలోకి దిగే అవకాశం కనిపిస్తోంది. తను 99 శాతం ఫిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉన్నాడని కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రోహిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తెలిపాడు. ఇషాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓపెనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా వస్తే ఇండియా ఫైనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎలెవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మారనుంది. ఈ ఏడాది భీకర ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్న గిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆసియా కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఉతికేశాడు. పైగా ఐపీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గుజరాత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టైటాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఆడిన శుభ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఈ స్టేడియంపై మంచి పట్టుంది. ఇక, రోహిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కోహ్లీ, కేఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాహుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కొనసాగిస్తే ఇండియాకు తిరుగుండదు. ఫస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో డకౌటైన శ్రేయస్ అఫ్గాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై టచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి వచ్చాడు. అయితే, స్టార్లతో నిండిన ఇండియా బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లైనప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నకు పాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షాహీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షా నుంచి అతి పెద్ద ముప్పు పొంచి ఉంది. పదునైన పేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, యార్కర్లతో హడలెత్తించే ఈ యంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఒక్క ఓవర్​తో  మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మార్చగలడు. ఆసియా కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాదిరిగా ఓపెనర్లు ముందుగానే షాహీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై పైచేయి సాధిస్తే బాగుంటుంది. ఒకవేళ తనను జాగ్రత్తగా ఎదుర్కోవాల్సి వస్తే మాత్రం  అంతగా ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో లేని మరో న్యూ బాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బౌలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హసన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అలీ, స్పిన్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షాదాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఖాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను టార్గెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయొచ్చు. ఇక, బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  స్పిన్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కుల్దీప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బుమ్రా, సిరాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మంచి రిథమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్నారు. స్పిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ –ఆల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రౌండర్లు జడేజా, హార్దిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాండ్యా కూడా సత్తా చాటుతున్నారు. పెద్ద బౌండరీల దృష్ట్యా అవసరమైతే ముగ్గురు స్పిన్నర్లతో ఆడుతామని రోహిత్​ చెప్పిన నేపథ్యంలో ఎనిమిదో నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో శార్దూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కంటే అశ్విన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కే మొగ్గు కనిపిస్తోంది. 

ఆ ఇద్దరినీ ఆపాలె

రెండు వార్మప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లో ఓడి తొలి పోరులో నెదర్లాండ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఓడించేందుకు కష్టపడ్డ పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గత మ్యాచ్​లో శ్రీలంకపై అనూహ్యంగా ఆడింది. బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫెయిల్యూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో భారీగా రన్స్ ఇచ్చుకున్నప్పటికీ కొండంత టార్గెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఛేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసి ఒక్కసారిగా బలంగా మారింది. సెంచరీలతో పాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను గెలిపించిన కీపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్యాటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మహ్మద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిజ్వాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఓపెనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అబ్దుల్లా షఫీక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్నారు. వీళ్లను అడ్డుకోవడం ఇండియాకు కీలకం కానుంది. ఇక, పాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎక్కువగా కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆజమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పైనే ఆధారపడింది. వార్మప్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో దుమ్మురేపి గత రెండు మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లో ఆకట్టుకోలేకపోయిన బాబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇండియాపై తమ బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ముందుండి నడిపించాలని అనుకుంటున్నాడు. తను ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి వస్తే ఆపడం కష్టం. కాబట్టి అతను కుదురుకోకపోముందే అడ్డుకోవాలి. ఇందుకు చైనామన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కుల్దీప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కీలకం కానున్నాడు. 2019 వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మ్యాజిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో బాబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పని పట్టిన అతను ఈసారి కూడా అదే రిపీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయాలని చూస్తున్నాడు. కుల్దీప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఎదుర్కొనే ముందు పాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్యాటర్లు తొలి స్పెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బుమ్రా, సిరాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సవాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తట్టుకొని ఏ మేరకు నిలబడతారో చూడాలి.

ఆటకు ముందు ఆహ్లాదం

ఇండో–పాక్‌‌ హైఓల్టేజ్‌‌ మ్యాచ్‌‌కు ముందు నరేంద్ర మోదీ స్టేడియంలో బీసీసీఐ  ప్రత్యేక సెర్మనీని ఏర్పాటు చేసింది. సింగర్లు అరిజీత్‌‌ సింగ్‌‌, శంకర్‌‌ మహదేవన్, సుఖ్మీందర్‌‌ సింగ్‌‌, నేహా కక్కర్‌‌లతో స్పెషల్‌‌ మ్యూజిక్‌‌ సెర్మనీ నిర్వహించనుంది. మధ్యాహ్నం 12.30కు మొదలయ్యే ఈ సెర్మనీలో  బీసీసీఐ నుంచి గోల్డెన్‌‌ టికెట్లు అందుకున్న సచిన్‌‌ టెండూల్కర్​, అమితాబ్‌‌ బచ్చన్‌‌, రజనీకాంత్‌‌ తదితరులు కూడా పాల్గొంటారు.

పిచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌/వాతావరణం

ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసం నల్లమట్టితో కూడిన వికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఉపయోగించనున్నారు. ఇది కాస్త  బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అనుకూలించనుంది. మధ్యాహ్నం పూట వేడి, ఉక్కపోత ఉండనుండగా.. రాత్రి సమయంలో మంచు కురవనుంది. శనివారం వర్ష సూచన కూడా ఉంది. ఈ నేపథ్యంలో టాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కీలకం కానుంది. 

తుది జట్లు (అంచనా)

ఇండియా : రోహిత్ శర్మ (కెప్టెన్),  గిల్/ ఇషాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కోహ్లీ, అయ్యర్, రాహుల్ (కీపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌), హార్దిక్ పాండ్యా,   జడేజా, శార్దూల్​/షమీ, బుమ్రా, కుల్దీప్ యాదవ్,  మహ్మద్ సిరాజ్.
పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: షఫీక్, ఇమామ్-,  బాబర్ ఆజమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (కెప్టెన్), రిజ్వాన్ (కీపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌), సౌద్ షకీల్,  ఇఫ్తికార్ అహ్మద్, షాదాబ్,  నవాజ్,  షాహీన్ ఆఫ్రిది, 
హసన్ అలీ/మహమ్మద్ వసీం, రవూఫ్