తిప్పేసిన అశ్విన్..సౌతాఫ్రికా 431 ఆలౌట్

తిప్పేసిన అశ్విన్..సౌతాఫ్రికా 431 ఆలౌట్

టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో  సౌతాఫ్రికా 431 పరుగులకు ఆలౌట్ అయి తొలి ఇన్నింగ్స్ ను ముగించింది. టీమిండియా స్పిన్నర్ అశ్విన్ 7 వికెట్లతో రెచ్చిపోయాడు.  385 పరుగులు 8 వికెట్లతో నాల్గో రోజు ఆట మొదలు పెట్టిన సౌతాఫ్రికా మరో 46 పరుగులు చేసి 431 పరుగులకు ఆలౌట్ అయ్యింది. సౌతాఫ్రికా బ్యాట్స్ మెన్  డీన్ ఎల్గర్ 160, డీకాక్ 111,డుప్లెసిస్ 55 రన్స్ తో రాణించారు. అంతకుముందు భారత్ మొదటి ఇన్సింగ్స్ ను  7 వికెట్లు కోల్పోయి 502 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది.  ప్రస్తుతం రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన భారత్ ఒక వికెట్ కోల్పోయింది.  మయాంక్ అగర్వాల్ 7 రన్స్ చేసి ఔట్ అయ్యాడు. ప్రస్తుతం ఒక వికెట్ నష్టానికి భారత్ 24 పరుగులు చేసింది. దీంతో భారత్  95 పరుగుల అధిక్యంలో ఉంది.