V6 News

ఫుల్‌‌‌‌‌‌‌‌టైమ్‌‌‌‌‌‌‌‌ కెప్టెన్‌‌‌‌‌‌‌‌గా రోహిత్‌‌‌‌‌‌‌‌కు తొలి సవాల్‌‌‌‌‌‌‌‌

ఫుల్‌‌‌‌‌‌‌‌టైమ్‌‌‌‌‌‌‌‌ కెప్టెన్‌‌‌‌‌‌‌‌గా రోహిత్‌‌‌‌‌‌‌‌కు తొలి సవాల్‌‌‌‌‌‌‌‌

అహ్మదాబాద్‌‌‌‌‌‌‌‌: కొత్త కెప్టెన్‌‌‌‌‌‌‌‌ రోహిత్‌‌‌‌‌‌‌‌ శర్మ లీడర్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌లో 1000వ వన్డేకు రెడీ అయిన టీమిండియాకు పాత సమస్యలే స్వాగతం పలుకుతున్నాయి. ఎన్ని కాంబినేషన్లు  మార్చినా.. ఎంత మందిని పరీక్షించినా.. మిడిల్‌‌‌‌‌‌‌‌ సెట్‌‌‌‌‌‌‌‌ అవ్వడం లేదు. ఈ సమస్యకు పరిష్కారం కనుకొనడంతో పాటు 2023 వన్డే వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌నకు సరైన కాంబినేషన్‌‌‌‌‌‌‌‌ను తయారు చేసుకోవడమే టార్గెట్‌‌‌‌‌‌‌‌గా వెస్టిండీస్‌‌‌‌‌‌‌‌తో మూడు వన్డేల సిరీస్‌‌‌‌‌‌‌‌లో  రోహిత్‌‌‌‌‌‌‌‌సేన బరిలోకి దిగుతోంది. ఆదివారం జరిగే తొలి మ్యాచ్‌‌‌‌‌‌‌‌తోనే  కొత్త అప్రోచ్‌‌‌‌‌‌‌‌తో ముందుకెళ్లాలని చూస్తోంది. అంత బలంగా లేని సౌతాఫ్రికా చేతిలో చిత్తుగా ఓడిన తర్వాత  రోహిత్‌‌‌‌‌‌‌‌, హెడ్​ కోచ్‌‌‌‌‌‌‌‌ రాహుల్‌‌‌‌‌‌‌‌ ద్రవిడ్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌ను తక్షణమే విన్నింగ్‌‌‌‌‌‌‌‌ ట్రాక్‌‌‌‌‌‌‌‌లోకి తీసుకురావాల్సిన అవసరం ఏర్పడింది. 2015, 2019 వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్స్‌‌‌‌‌‌‌‌లో ఇండియా ఫెయిలైన నేపథ్యంలో రోహిత్‌‌‌‌‌‌‌‌–రాహుల్‌‌‌‌‌‌‌‌ ద్వయం రాబోయే నెలల్లో ఈ ఫార్మాట్‌‌‌‌‌‌‌‌లో టీమ్ పంథాను పూర్తిగా మార్చాలని చూస్తున్నారు. అందుకు ఈ సిరీస్‌‌‌‌‌‌‌‌తోనే తొలి అడుగు వేయాలని భావిస్తున్నారు. 

ఓపెనర్‌‌‌‌‌‌‌‌గా ఇషాన్‌‌‌‌‌‌‌‌

హిస్టారికల్‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌కు ముందు ఇండియాను కరోనా దెబ్బ కొట్టింది. ఫామ్‌‌‌‌‌‌‌‌లో ఉన్న సీనియర్‌‌‌‌‌‌‌‌ ఓపెనర్‌‌‌‌‌‌‌‌ ధవన్‌‌‌‌‌‌‌‌తో పాటు గైక్వాడ్‌‌‌‌‌‌‌‌, శ్రేయస్‌‌‌‌‌‌‌‌ పాజిటివ్‌‌‌‌‌‌‌‌గా తేలారు. మరోవైపు వైట్‌‌‌‌‌‌‌‌ బాల్‌‌‌‌‌‌‌‌ వైస్‌‌‌‌‌‌‌‌ కెప్టెన్‌‌‌‌‌‌‌‌ కేఎల్​రాహుల్‌‌‌‌‌‌‌‌ ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌కు అందుబాటులో లేడు. దాంతో, మయాంక్‌‌‌‌‌‌‌‌ అగర్వాల్‌‌‌‌‌‌‌‌, ఇషాన్‌‌‌‌‌‌‌‌ కిషన్‌‌‌‌‌‌‌‌, షారుక్‌‌‌‌‌‌‌‌ ఖాన్‌‌‌‌‌‌‌‌ను టీమ్‌‌‌‌‌‌‌‌లో చేర్చారు.ఇషాన్‌‌‌‌‌‌‌‌తో కలిసి రోహిత్‌‌‌‌‌‌‌‌ ఓపెనింగ్‌‌‌‌‌‌‌‌ చేయనున్నాడు. గాయం వల్ల సౌతాఫ్రికా టూర్‌‌‌‌‌‌‌‌కు దూరంగా ఉన్న హిట్‌‌‌‌‌‌‌‌మ్యాన్‌‌‌‌‌‌‌‌ ఓపెనర్‌‌‌‌‌‌‌‌గానే కాకుండా.. కెప్టెన్‌‌‌‌‌‌‌‌గానూ ఇప్పుడు టీమ్‌‌‌‌‌‌‌‌ను ముందుండి నడిపించాలి. వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించిన తర్వాత విరాట్‌‌‌‌‌‌‌‌ కోహ్లీ ఫస్ట్ టైమ్‌‌‌‌‌‌‌‌ రోహిత్‌‌‌‌‌‌‌‌ శర్మ నాయకత్వంలో ఓ మ్యాచ్‌‌‌‌‌‌‌‌ ఆడుతున్నాడు. సౌతాఫ్రికాపై రెండు ఫిఫ్టీలు కొట్టిన తను అదే జోరును ఇక్కడా కొనసాగించాలి. తన పెర్ఫామెన్స్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌కు చాలా ముఖ్యం కూడా. అయితే, మిడిలార్డర్‌‌‌‌‌‌‌‌ మెప్పిస్తేనే ఇండియా సాఫీగా ముందుకెళ్లగలదు. సౌతాఫ్రికా సిరీస్‌‌‌‌‌‌‌‌లో సెకండ్‌‌‌‌‌‌‌‌ వన్డేలో రిషబ్‌‌‌‌‌‌‌‌ పంత్‌‌‌‌‌‌‌‌ ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ తప్పిస్తే.. మన మిడిలార్డర్‌‌‌‌‌‌‌‌ ఫెయిలైంది. మిడిల్‌‌‌‌‌‌‌‌లో బాగా ఆడే ప్లేయర్లు ఇండియాకు ఇప్పుడు అత్యవసరం. శ్రేయస్‌‌‌‌‌‌‌‌ లేకపోవడంతో సూర్యకుమార్‌‌‌‌‌‌‌‌ కు మరో చాన్స్‌‌‌‌‌‌‌‌ రానుంది. సౌతాఫ్రికాపై యంగ్‌‌‌‌‌‌‌‌ ఆల్‌‌‌‌‌‌‌‌రౌండర్‌‌‌‌‌‌‌‌ వెంకటేశ్‌‌‌‌‌‌‌‌ కు చాన్స్‌‌‌‌‌‌‌‌ ఇచ్చినా.. తను దాన్ని యూజ్​ చేసుకోలేకపోయాడు. తను వద్దనుకుంటే అనూహ్యంగా ఈ సిరీస్‌‌‌‌‌‌‌‌కు ఎంపికైన దీపక్‌‌‌‌‌‌‌‌ హుడా, ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌ కోసం టీమ్‌‌‌‌‌‌‌‌లో చేర్చిన తమిళనాడు హార్డ్‌‌‌‌‌‌‌‌ హిట్టర్‌‌‌‌‌‌‌‌ షారుక్‌‌‌‌‌‌‌‌ ఖాన్‌‌‌‌‌‌‌‌ను పరీక్షించొచ్చు. అయితే, ఎవరికి చాన్స్‌‌‌‌‌‌‌‌ వచ్చినా బాగా ఆడకుంటే వేటు పడటం పక్కా అని గుర్తుంచుకోవాలి. కీపర్‌‌‌‌‌‌‌‌ పంత్‌‌‌‌‌‌‌‌ కూడా సిచ్యువేషన్‌‌‌‌‌‌‌‌కు తగ్గట్టు షాట్లు ఆడితే బాగుంటుంది. ఇక, బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో చహల్‌‌‌‌‌‌‌‌.. మళ్లీ కుల్దీప్‌‌‌‌‌‌‌‌ యాదవ్‌‌‌‌‌‌‌‌తో జోడీ కట్టనున్నాడు. మరో యంగ్‌‌‌‌‌‌‌‌ లెగ్‌‌‌‌‌‌‌‌ స్పిన్నర్‌‌‌‌‌‌‌‌ రవి బిష్నోయ్‌‌‌‌‌‌‌‌ను పరీక్షించే అవకాశమూ లేకపోలేదు. స్టార్‌‌‌‌‌‌‌‌ పేసర్లు బుమ్రా, షమీ ఆబ్సెంట్‌‌‌‌‌‌‌‌లో.. సౌతాఫ్రికాపై బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌లోనూ సత్తా చాటిన శార్దూల్‌‌‌‌‌‌‌‌, దీపక్‌‌‌‌‌‌‌‌ చహర్‌‌‌‌‌‌‌‌ పేస్‌‌‌‌‌‌‌‌ బాధ్యతలు తీసుకోనున్నారు. థర్డ్‌‌‌‌‌‌‌‌ పేసర్‌‌‌‌‌‌‌‌గా ప్రసిధ్‌‌‌‌‌‌‌‌ కృష్ణ, సిరాజ్‌‌‌‌‌‌‌‌లో ఒకరికి చాన్స్‌‌‌‌‌‌‌‌ రావొచ్చు. 

కరీబియన్లతో కంగారే

పలువురు స్టార్‌‌‌‌‌‌‌‌ ప్లేయర్లు దూరమైన తర్వాత లిమిటెడ్‌‌‌‌‌‌‌‌ ఓవర్లలోనూ వెస్టిండీస్‌‌‌‌‌‌‌‌ డీలా పడ్డది. సొంతగడ్డపై ఆడిన చివరి వన్డే సిరీస్‌‌‌‌‌‌‌‌లో చిన్న టీమ్‌‌‌‌‌‌‌‌ ఐర్లాండ్‌‌‌‌‌‌‌‌ చేతిలో 1–2తో  ఓడిపోయింది. కానీ,  వెంటనే జరిగిన టీ20 సిరీస్‌‌‌‌‌‌‌‌లో పటిష్ట ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌ను 3–2తో ఓడించి పుంజుకుంది.  హెట్‌‌‌‌‌‌‌‌మయర్‌‌‌‌‌‌‌‌ లేకపోవడం ఆ టీమ్‌‌‌‌‌‌‌‌కు లోటే. అయినా కెప్టెన్‌‌‌‌‌‌‌‌ కీరన్‌‌‌‌‌‌‌‌ పొలార్డ్‌‌‌‌‌‌‌‌, ఆల్‌‌‌‌‌‌‌‌రౌండర్‌‌‌‌‌‌‌‌ జేసన్‌‌‌‌‌‌‌‌ హోల్డర్‌‌‌‌‌‌‌‌, వన్డేల్లో కమ్‌‌‌‌‌‌‌‌బ్యాక్‌‌‌‌‌‌‌‌ చేస్తున్న కీమర్‌‌‌‌‌‌‌‌ రోచ్‌‌‌‌‌‌‌‌ వంటి ఎక్స్‌‌‌‌‌‌‌‌పీరియన్స్‌‌‌‌‌‌‌‌డ్‌‌‌‌‌‌‌‌ ప్లేయర్లతో పాటు పవర్‌‌‌‌‌‌‌‌ హిట్టర్‌‌‌‌‌‌‌‌ పూరన్‌‌‌‌‌‌‌‌తో విండీస్‌‌‌‌‌‌‌‌ బాగానే కనిపిస్తోంది. ఈ మధ్య సూపర్‌‌‌‌‌‌‌‌ పెర్ఫామెన్స్‌‌‌‌‌‌‌‌ చేస్తున్న స్పిన్నర్‌‌‌‌‌‌‌‌ అకీల్‌‌‌‌‌‌‌‌ హొస్సేన్‌‌‌‌‌‌‌‌ కీలకం కానున్నాడు. ఈ సిరీస్‌‌‌‌‌‌‌‌ తర్వాత ఐపీఎల్‌‌‌‌‌‌‌‌ మెగా ఆక్షన్‌‌‌‌‌‌‌‌ ఉండటంతో తమ స్కిల్స్‌‌‌‌‌‌‌‌ ప్రూవ్‌‌‌‌‌‌‌‌ చేసుకొని ఫ్రాంచైజీల  కండ్లలో పడాలని కరీబియన్లు కచ్చితంగా ఆశిస్తారు. కాబట్టి ఆ టీమ్‌‌‌‌‌‌‌‌ను తక్కువ అంచనా వేయలేం.

టీమ్స్‌‌‌‌‌‌‌‌ (అంచనా)

ఇండియా: రోహిత్‌‌‌‌‌‌‌‌ (కెప్టెన్‌‌‌‌‌‌‌‌), ఇషాన్‌‌‌‌‌‌‌‌, కోహ్లీ, పంత్‌‌‌‌‌‌‌‌ (కీపర్‌‌‌‌‌‌‌‌), సూర్యకుమార్‌‌‌‌‌‌‌‌, హుడా/సుందర్‌‌‌‌‌‌‌‌/షారుక్‌‌‌‌‌‌‌‌, చహర్‌‌‌‌‌‌‌‌, శార్దూల్‌‌‌‌‌‌‌‌, కుల్దీప్‌‌‌‌‌‌‌‌, చహల్‌‌‌‌‌‌‌‌, ప్రసిధ్‌‌‌‌‌‌‌‌/సిరాజ్‌‌‌‌‌‌‌‌.

వెస్టిండీస్‌‌‌‌‌‌‌‌:  షై హోప్‌‌‌‌‌‌‌‌ (కీపర్‌‌‌‌‌‌‌‌), బ్రెండన్‌‌‌‌‌‌‌‌ కింగ్‌‌‌‌‌‌‌‌/బోనర్‌‌‌‌‌‌‌‌, పూరన్‌‌‌‌‌‌‌‌, బ్రూక్స్‌‌‌‌‌‌‌‌, డానెన్‌‌‌‌‌‌‌‌ బ్రావో, పొలార్డ్‌‌‌‌‌‌‌‌ (కెప్టెన్‌‌‌‌‌‌‌‌), ఓడెన్‌‌‌‌‌‌‌‌/రొమారియో, హోల్డర్‌‌‌‌‌‌‌‌, అకీల్‌‌‌‌‌‌‌‌, రోచ్‌‌‌‌‌‌‌‌, హేడెన్‌‌‌‌‌‌‌‌ వాల్ష్‌‌‌‌‌‌‌‌

పిచ్‌‌‌‌‌‌‌‌/వాతావరణం

పిచ్‌‌‌‌‌‌‌‌ బ్యాటింగ్​కు సపోర్ట్‌‌‌‌‌‌‌‌ చేస్తోంది. లాంగ్‌‌‌‌‌‌‌‌ బౌండ్రీలు ఉండటం వల్ల హిట్టింగ్‌‌‌‌‌‌‌‌ కొంచెం కష్టం అవ్వొచ్చు. సాయంత్రం మంచు ప్రభావం ఉంటుంది. వాన సూచన లేదు.

మోడీ స్టేడియంలో మస్తు రికార్డులు

టీమిండియా 1000వ మ్యాచ్‌‌‌‌‌‌‌‌కు ఆతిథ్యం ఇస్తున్న  అహ్మదాబాద్​లోని నరేంద్ర మోడీ స్టేడియం (మొతెరా) అనేక హిస్టారిక్‌‌‌‌‌‌‌‌ మూమెంట్స్‌‌‌‌‌‌‌‌కు వేదికైంది. 

వాటిలో కొన్ని.. 

  •     టెస్ట్‌‌‌‌‌‌‌‌ల్లో సునీల్‌‌‌‌‌‌‌‌ గావస్కర్‌‌‌‌‌‌‌‌ 10 వేల రన్‌‌‌‌‌‌‌‌ ఈ స్టేడియంలోనే (1987) తీశాడు. 
  •     1994లో కపిల్‌‌‌‌‌‌‌‌ దేవ్‌‌‌‌‌‌‌‌ టెస్ట్‌‌‌‌‌‌‌‌ల్లో హయ్యెస్ట్‌‌‌‌‌‌‌‌ వికెట్ల ఘనత ఇక్కడే సాధించాడు. 
  •     1999లో సచిన్‌‌‌‌‌‌‌‌ ఫస్ట్‌‌‌‌‌‌‌‌ టెస్టుల్లో  డబుల్‌‌‌‌‌‌‌‌ సెంచరీ  ఈ గ్రౌండ్​లోనే వచ్చింది.
  •     టెస్ట్‌‌‌‌‌‌‌‌ల్లో స్పిన్నర్‌‌‌‌‌‌‌‌ అశ్విన్‌‌‌‌‌‌‌‌ 400వ వికెట్‌‌‌‌‌‌‌‌ తీసింది ఇక్కడే. 
  •     టాప్‌‌‌‌‌‌‌‌ స్పిన్నర్‌‌‌‌‌‌‌‌ హర్భజన్‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌ ఈ గ్రౌండ్‌‌‌‌‌‌‌‌లోనే ఫస్ట్‌‌‌‌‌‌‌‌ టెస్టు సెంచరీ చేశాడు. 
  •     1983లో కపిల్‌‌‌‌‌‌‌‌ విండీస్‌‌‌‌‌‌‌‌పై 9/83 వికెట్లతో రికార్డు సృష్టించాడు. 
  •     2011 వరల్డ్‌‌‌‌‌‌‌‌కప్‌‌‌‌‌‌‌‌లో ఆసీస్‌‌‌‌‌‌‌‌పై సచిన్‌‌‌‌‌‌‌‌ 18 వేల రన్‌‌‌‌‌‌‌‌ ఈ స్టేడియంలోనే సాధించాడు. 
  •     1996లో వీవీఎస్‌‌‌‌‌‌‌‌ లక్ష్మణ్‌‌‌‌‌‌‌‌.. సౌతాఫ్రికాపై ఇదే గ్రౌండ్‌‌‌‌‌‌‌‌లో టెస్ట్‌‌‌‌‌‌‌‌ డెబ్యూ చేశాడు.