దేశం భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది: రాహుల్ గాంధీ

దేశం భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది: రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ: ఇండో–చైనా సరిహద్దు ప్రతిష్ఠంభనపై మోడీ సర్కార్‌‌పై కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ పలుమార్లు విమర్శలకు దిగిన సంగతి తెలిసిందే. మరోమారు రాహుల్ కేంద్రంపై దాడికి దిగారు. ప్రభుత్వ పిరికితనానికి దేశం మూల్యం చెల్లించాల్సి ఉంటుందని రాహుల్ విమర్శించారు.

‘చైనా మన భూభాగాన్ని ఆక్రమించింది. గవర్నమెంట్ ఆఫ్​ ఇండియా చాంబర్లెన్‌ (రాష్ట్రపతి భవనంలో గృహ బాధ్యతలు నిర్వహించే అధికారి)లా వ్యవహరిస్తోంది. ఇది మున్ముందు చైనాకు మరింత మనోధైర్యాన్ని ఇస్తుంది. కేంద్ర సర్కార్ పిరికి చర్యలకు ఇండియా భారీ మొత్తంలో మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది’ అని రాహుల్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు జతగా లడఖ్‌ టూర్‌‌లో రాజ్‌నాథ్ చేసిన వ్యాఖ్యలను జత చేశారు. ప్రపంచంలోని ఏ శక్తి కూడా మా భూభాగంలో నుంచి ఒక్క ఇంచు భూమిని తీసుకుపోలేదు అని సదరు వీడియోలో రాజ్‌నాథ్ చెప్పారు.