అన్ని డిజిటల్ సేవలకు టెలికాం మూలం

అన్ని డిజిటల్ సేవలకు టెలికాం మూలం

6G లో గ్లోబల్ లీడ్ తీసుకోవాలనే ఉద్దేశంతో ఉన్నామని టెలికాం మినిస్టర్ అశ్విని వైష్ణవ్ అన్నారు. నిన్న 13 నగరాల్లో 5G సేవలను  ప్రధాని మోడీ ప్రారంభించారు. ఈ దశాబ్ధం చివరి నాటికి 6Gని అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ప్రగతి మైదాన్ లో  ఇండియా మొబైల్ కాంగ్రెస్ ను అశ్విని వైష్ణవ్ సందర్శించారు.

ఆధునిక జీవితంలో మనం చూస్తున్న అన్ని డిజిటల్ సేవలకు టెలికాం మూలమన్నారు. 5G సేవలతో విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, లాజిస్టిక్స్, బ్యాంకింగ్ వంటి అనేక రంగాల్లో ప్రాథమిక  మార్పును తీసుకొస్తాయని అశ్విని వైష్ణవ్ తెలిపారు.