4 ‑1తో గెలిచిన్రు..ఐదో టెస్టులో ఇండియా గ్రాండ్‌‌‌‌‌‌‌‌ విక్టరీ

4 ‑1తో గెలిచిన్రు..ఐదో టెస్టులో ఇండియా గ్రాండ్‌‌‌‌‌‌‌‌ విక్టరీ
  •     ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ 64 రన్స్‌‌‌‌‌‌‌‌ తేడాతో ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌ చిత్తు
  •     అశ్విన్‌‌‌‌‌‌‌‌కు 5 వికెట్లు
  •     రూట్‌‌‌‌‌‌‌‌ పోరాటం వృథా

ధర్మశాల : తొలి టెస్టులో అనూహ్యంగా ఓడినా.. బజ్‌‌‌‌‌‌‌‌బాల్‌‌‌‌‌‌‌‌  గేమ్‌‌తో ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌ ఆరంభంలో సృష్టించినా.. స్వదేశంలో తమకు ఎదురులేదని టీమిండియా మరోసారి నిరూపించింది. ధర్మశాలలో తమ దమ్ము చూపెడుతూ ఐదో మ్యాచ్‌‌‌‌‌‌‌‌లోనూ భారీ విజయం సాధించింది. రవిచంద్రన్‌‌‌‌‌‌‌‌ అశ్విన్‌‌‌‌‌‌‌‌ (5/77), కుల్దీప్‌‌‌‌‌‌‌‌ (2/40) స్పిన్ మ్యాజిక్‌‌‌‌‌‌‌‌కు తోడు పేసర్‌‌‌‌‌‌‌‌ బుమ్రా (2/38) చెలరేగడంతో.. మూడు రోజుల్లోనే ముగిసిన ఆఖరి టెస్టులో ఇండియా ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ 64 రన్స్‌‌‌‌‌‌‌‌ తేడాతో ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌ను చిత్తు చేసింది. 

దీంతో ఐదు మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల సిరీస్‌‌‌‌‌‌‌‌ను రోహిత్‌‌‌‌‌‌‌‌సేన 4–1తో సొంతం చేసుకుంది.ఓవర్‌‌‌‌‌‌‌‌నైట్‌‌‌‌‌‌‌‌ స్కోరు 473/8తో శనివారం ఆట కొనసాగించిన ఇండియా తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో 124.1 ఓవర్లలో 477 రన్స్‌‌‌‌‌‌‌‌కు ఆలౌటైంది.  దాంతో 259 పరుగుల ఆధిక్యం సాధించింది. నాలుగు పరుగుల తేడాలో ఓవర్‌‌‌‌‌‌‌‌నైట్‌‌‌‌‌‌‌‌ బ్యాటర్లు కుల్దీప్‌‌‌‌‌‌‌‌ (30), బుమ్రా (20) ఔటయ్యారు. బషీర్‌‌‌‌‌‌‌‌ ఐదు అండర్సన్‌‌‌‌‌‌‌‌, హార్ట్‌‌‌‌‌‌‌‌లీ చెరో రెండు వికెట్లు తీశారు. తర్వాత భారీ లోటు స్కోరుతో రెండో ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ మొదలుపెట్టిన ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌ 48.1 ఓవర్లలో 195 రన్స్‌‌‌‌‌‌‌‌కే కుప్పకూలింది. జో రూట్‌‌‌‌‌‌‌‌ (84) ఒంటరి పోరాటం చేశాడు. కుల్దీప్‌‌‌‌‌‌‌‌కు ‘ప్లేయర్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌‌‌‌‌’, యశస్వి జైస్వాల్‌‌‌‌‌‌‌‌కు ‘ప్లేయర్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ ద సిరీస్‌‌‌‌‌‌‌‌’ అవార్డులు లభించాయి. 

బౌలర్లు సూపర్‌‌‌‌‌‌‌‌..

25 బాల్స్‌‌‌‌‌‌‌‌లోనే ఇండియా ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌కు తెరపడటంతో.. ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌ మార్నింగ్‌‌‌‌‌‌‌‌ సెషన్‌‌‌‌‌‌‌‌లోనే రెండో ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ను మొదలుపెట్టింది. కానీ అశ్విన్‌‌‌‌‌‌‌‌, కుల్దీప్‌‌‌‌‌‌‌‌, బుమ్రా బౌలింగ్‌‌‌‌‌‌‌‌ దెబ్బకు లైనప్‌‌‌‌‌‌‌‌ను కుప్పకూలింది. అశ్విన్‌‌‌‌‌‌‌‌.. రెండు, ఆరో ఓవర్లలో బెన్‌‌‌‌‌‌‌‌ డకెట్‌‌‌‌‌‌‌‌ (2), జాక్‌‌‌‌‌‌‌‌ క్రాలీ (0)ని ఔట్‌‌‌‌‌‌‌‌ చేసి శుభారంభాన్నిచ్చాడు. ఒలీ పోప్‌‌‌‌‌‌‌‌ (19)తో కలిసిన రూట్‌‌‌‌‌‌‌‌ నిలకడగా ఆడాడు. కానీ రెండో ఎండ్‌‌‌‌‌‌‌‌లో అతనికి సరైన సహకారం దక్కలేదు. 

రెండు వైపుల నుంచి అశ్విన్‌‌‌‌‌‌‌‌–కుల్దీప్‌‌‌‌‌‌‌‌ టర్నింగ్‌‌‌‌‌‌‌‌ను ఎదుర్కోలేకపోయారు. 10వ ఓవర్‌‌‌‌‌‌‌‌లో పోప్‌‌‌‌‌‌‌‌ ఔట్‌‌‌‌‌‌‌‌తో వికెట్ల పతనం వేగంగా కొనసాగింది. వందో టెస్ట్‌‌‌‌‌‌‌‌ ఆడుతున్న బెయిర్‌‌‌‌‌‌‌‌స్టో (39) నాలుగో వికెట్‌‌‌‌‌‌‌‌కు 56 రన్స్‌‌‌‌‌‌‌‌ జోడించి కాసేపు ఉపశమనం కలిగించాడు. కానీ 18వ ఓవర్‌‌‌‌‌‌‌‌లో కుల్దీప్‌‌‌‌‌‌‌‌ వేసిన టర్నింగ్‌ బాల్‌కు ఎల్బీ అయ్యాడు. ఆ వెంటనే అశ్విన్‌‌‌‌‌‌‌‌.. నాలుగు ఓవర్ల వ్యవధిలో స్టోక్స్‌‌‌‌‌‌‌‌ (2), ఫోక్స్‌‌‌‌‌‌‌‌ (8)ను ఔట్‌‌‌‌‌‌‌‌ చేశాడు. 113/6తో కష్టాల్లో పడిన ఇంగ్లిష్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌కు బుమ్రా డబుల్‌‌‌‌‌‌‌‌ స్ట్రోక్‌‌‌‌‌‌‌‌ ఇచ్చాడు. 

రూట్‌‌‌‌‌‌‌‌తో ఏడో వికెట్‌‌‌‌‌‌‌‌కు 28 రన్స్‌‌‌‌‌‌‌‌ జత చేసిన హార్ట్‌‌‌‌‌‌‌‌లీ (20), మార్క్‌‌‌‌‌‌‌‌ వుడ్‌‌‌‌‌‌‌‌ (0)ను 35వ ఓవర్‌‌‌‌‌‌‌‌లో వరుస బాల్స్‌‌‌‌‌‌‌‌లో ఔట్‌‌‌‌‌‌‌‌ చేశాడు. దీంతో స్కోరు 141/8గా మారింది. కొద్దిసేపటికే బషీర్‌‌‌‌‌‌‌‌ (13)  లాస్ట్‌‌‌‌‌‌‌‌ వికెట్‌‌‌‌‌‌‌‌గా రూట్‌‌‌‌‌‌‌‌ వెనుదిరగడంతో ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌కు ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ ఓటమి తప్పలేదు. 

36టెస్టుల్లో అశ్విన్‌‌‌‌‌‌‌‌ ఐదు వికెట్ల హాల్‌‌‌‌‌‌‌‌ సాధించడం ఇది 36వ సారి. ఇండియా తరఫున అత్యధికంగా ఐదు వికెట్లు హాల్ సాధించిన బౌలర్‌‌‌‌గా అనిల్‌‌‌‌‌‌‌‌ కుంబ్లే (35) రికార్డును అధిగమించాడు. 

9/128 ధర్మశాలలో అశ్విన్‌‌‌‌‌‌‌‌ ఓవరాల్ బౌలింగ్‌‌‌‌‌‌‌‌ పెర్ఫామెన్స్. వందో టెస్టులో బెస్ట్‌‌‌‌‌‌‌‌ బౌలింగ్‌‌‌‌‌‌‌‌ చేసిన క్రికెటర్‌‌‌‌గా మురళీధరన్‌‌‌‌‌‌‌‌ ( 2006లో బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌పై 9/141) రికార్డును బ్రేక్ చేశాడు. 

1 వందో టెస్ట్‌‌‌‌‌‌‌‌లో రెండు ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ల్లో నాలుగుకు పైగా వికెట్లు తీసిన తొలి బౌలర్‌‌‌‌‌‌‌‌ అశ్విన్‌‌‌‌‌‌‌‌. రెండో ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో ఐదు వికెట్లు తీసిన అశ్విన్‌‌‌‌‌‌‌‌ వందో మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో ఈ ఫీట్‌‌‌‌‌‌‌‌ సాధించిన తొలి బౌలర్‌‌‌‌‌‌‌‌గా నిలిచాడు. 

118 స్వదేశంలో ఎక్కువ టెస్టు విజయాలు సాధించిన మూడో టీమ్‌‌‌‌‌‌‌‌ ఇండియా. ఆస్ట్రేలియా (259), ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌ (233) ముందున్నాయి.

700  టెస్ట్‌‌‌‌‌‌‌‌ క్రికెట్‌‌‌‌‌‌‌‌ చరిత్రలో 700 వికెట్లు తీసిన తొలి పేసర్‌‌‌‌‌‌‌‌గా అండర్సన్‌‌‌‌‌‌‌‌ రికార్డులకెక్కాడు. ఓవరాల్‌‌‌‌‌‌‌‌గా మూడో బౌలర్‌‌‌‌‌‌‌‌గా నిలిచాడు. స్పిన్నర్లు మురళీధరన్‌‌‌‌‌‌‌‌ (800), వార్న్‌‌‌‌‌‌‌‌ (708) ముందున్నారు. 

సంక్షిప్త స్కోర్లు

ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌ తొలి ఇన్నింగ్స్‌ ‌‌‌‌‌‌‌: 218. ఇండియా తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌: 124.1 ఓవర్లలో 477 ఆలౌట్‌‌‌‌‌‌‌‌ (రోహిత్‌‌‌‌‌‌‌‌ 103, శుభ్‌‌‌‌‌‌‌‌మన్‌‌‌‌‌‌‌‌ గిల్‌‌‌‌‌‌‌‌ 110, పడిక్కల్‌‌‌‌‌‌‌‌ 65, సర్ఫరాజ్‌‌‌‌‌‌‌‌ 56, షోయబ్‌‌‌‌‌‌‌‌ బషీర్‌‌‌‌‌‌‌‌ 5/173). ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌ రెండో ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌: 48.1 ఓవర్లలో 195 ఆలౌట్‌‌‌‌‌‌‌‌ (రూట్‌‌‌‌‌‌‌‌ 84, బెయిర్‌‌‌‌‌‌‌‌స్టో 39, అశ్విన్‌‌‌‌‌‌‌‌ 5/77).