
వరల్డ్ కప్ లో భారత్ శుభారంభం చేసింది. ఆడిన తొలి మ్యాచ్ లోనే 6 వికెట్ల ఆధిక్యతతో దక్షిణాఫ్రికాపై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. దీంతో 228 పరగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ రోహిత్ శర్మ అద్భుత సెంచరీతో 47.3 ఓవర్లలోనే నాలుగు వికెట్లు కోల్పోయి 230 పరుగుల చేసి 6 వికెట్ల ఆధిక్యతతో విజయం సాధించింది. రోహిత్ శర్మ 122 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు
దక్షిణాఫ్రికాపై భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన రోహిత్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. రోహిత్ శర్మ 144 బంతుల్లో 13 ఫోర్లు 2 సిక్సర్లతో 122 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.