
టీ20 ప్రపంచకప్ లో భాగంగా జింబాబ్వేతో జరిగిన మ్యాచ్ లో 71 పరుగుల తేడాతో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. 187 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే 115 రన్స్ కు ఆలౌట్ అయింది. 9 ఓవర్లు ముగిసేసరికి ఆ జట్టు సగం వికెట్లను కోల్పోయింది. బర్ల్ (35), సికిందర్ రజ్వా (34) రాణించగా మిగతా ఆటగాళ్లు ఎవరూ వారికి సహకరించలేకపోయారు. టీమిండియా బౌలర్లలలో అశ్విన్ మూడు వికెట్లు తీశాడు.
అంతకుముందు టాస్ గెలిచిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల 186 నష్టానికి పరుగులు చేసింది. రాహుల్(51), సూర్య(61) పరుగులతో రాణించారు. ఈ విక్టరీతో టీమిండియా గ్రూప్ -2లో అగ్రస్థానం దక్కించుకొని సెమీస్‌కు దూసుకెళ్లింది. బుధవారం జరిగే తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్‌తో పాకిస్థాన్ తలపడనుండగా, గురువారం జరిగే రెండో సెమీ ఫైనల్‌లో ఇంగ్లండ్‌తో టీమిండియా పోరాడనుంది.