జార్ఖండ్ : ఇండియా-ఆస్ట్రేలియా జట్ల మధ్య ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా మూడో మ్యాచ్ ఇవాళ మధ్యాహ్నం రాంచీ స్టేడియంలో మొదలైంది. టాస్ గెలిచిన కోహ్లీ .. బౌలింగ్ తీసుకున్నాడు. ఆస్ట్రేలియా బ్యాటింగ్ కు దిగింది. తొలి రెండు మ్యాచ్ లను నెగ్గిన ఇండియా… ఈ మ్యాచ్ లోనూ గెలిచి సిరీస్ దక్కించుకోవాలని తహతహలాడుతోంది. మరోవైపు… ఈ మ్యాచ్ లో గెలిస్తేనే కానీ… సిరీస్ రేసులో నిలవలేని పరిస్థితి ఆస్ట్రేలియాది. కోహ్లీ గ్యాంగ్ దూకుడుకు కళ్లెం వేయాలని ఫించ్ టీమ్ ప్రణాళికలు వేసింది.

