నేతాజీ ఉంటే భారతదేశం విడిపోయేది కాదు.. ఎన్‌ఎస్‌ఏ అజిత్ దోవల్ సంచలన వ్యాఖ్యలు

నేతాజీ ఉంటే భారతదేశం విడిపోయేది కాదు.. ఎన్‌ఎస్‌ఏ అజిత్ దోవల్ సంచలన వ్యాఖ్యలు

నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవించి ఉంటే భారతదేశం విడిపోయి ఉండేది కాదని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కీలక వ్యాఖ్యలు చేశారు. అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా (అసోచామ్) ఢిల్లీలో నిర్వహించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్మారక ఉపన్యాసంలో దోవల్ పాల్గొన్నారు. నేతాజీ తన జీవితంలోని వివిధ దశల్లో ధైర్యం ప్రదర్శించారని, గాంధీని ఎదిరించే ధైర్యం ఉందని దోవల్ తన ఉపన్యాసంలో పేర్కొన్నారు. "కానీ గాంధీ తన రాజకీయ జీవితంలో అత్యున్నత స్థానంలో ఉన్నారు. ఆ తర్వాత ఆయన రాజీనామా చేసి, కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్లీ తన పోరాటాన్ని ప్రారంభించారు" అని దోవల్ చెప్పారు. "నేను మంచి లేదా చెడు అని చెప్పడం లేదు, కానీ భారతదేశ చరిత్ర, ప్రపంచ చరిత్రలో ప్రవాహానికి వ్యతిరేకంగా ప్రయాణించే ధైర్యం ఉన్న వ్యక్తులకు చాలా తక్కువ ప్రాముఖ్యత ఉంది. కానీ ఇంత సులభమైంది కాదు" అని దోవల్ అన్నారు. అతనికి జపాన్ తప్ప మరే దేశం మద్దతు ఇవ్వలేదన్న ఆయన.. గాంధీని సవాలు చేసే ధైర్యం నేతాజీకి ఉందని అజిత్ దోవల్ స్పష్టం చేశారు.

"నేను బ్రిటిష్ వారితో పోరాడుతాను, నేను స్వాతంత్ర్యం కోసం అడుక్కోను, అది నా హక్కు, దాన్ని పొందాల్సి ఉంటుంది " అని చంద్రబోస్ అనే వారని ధోవల్ చెప్పారు. పాకిస్తాన్ జాతిపితగా పరిగణించే మొహమ్మద్ అలీ జిన్నా కూడా తాను అంగీకరించే ఒకే ఒక్క నాయకుడు సుభాష్ చంద్రబోస్ అని చెప్పినట్లుగా ధోవల్ వెల్లడించారు. అలాగే మహాత్మాగాంధీ స్ధానంలో బోస్ ఉండుంటే బ్రిటీష్ వాళ్లను స్వాతంత్ర్యం కోసం అడుక్కునే వారు కాదన్నారు.

‘మరెవ్వరికీ లేని ధైర్యసాహసాలను బోస్ కలిగి ఉన్నారు.. పర్యవసానాలతో సంబంధం లేకుండా ప్రబలమైన శక్తులను సవాలు చేసే ధైర్యం ఆయనకు ఉంది. అతని ధైర్యం, దృఢ సంకల్పం ICS కోసం లండన్‌కు వెళ్లడం నుంచి నిర్బంధ సమయంలో తప్పించుకునే వరకు అతని ధైర్యం స్పష్టంగా కనిపించింది’ అని దోవల్ అన్నారు.