మెదక్ టౌన్, వెలుగు: హిందూ దేవాలయాలపై దాడులకు నిరసనగా హిందూ సంస్థల పిలుపు మేరకు సోమవారం నిర్వహించిన మెదక్ పట్టణ బంద్ సక్సెస్ అయింది. ఉదయం నుంచి పట్టణంలో ర్యాలీగా తిరుగుతూ వ్యాపార, వాణిజ్య సంస్థలు బంద్ చేయించారు. ప్రైవేట్ స్కూల్స్, పెట్రోల్ బంకులు, ఇతర వాణిజ్య సంస్థలను మూసివేయించారు.
ఈ సందర్భంగా బీజేపీ, బీజేవైఎం నాయకులు మాట్లాడుతూ ఉద్దేశపూర్వకంగా కొందరు హిందూ దేవాలయాలపై దాడులకు పాల్పడుతున్నారని, అపవిత్రం చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశ్‌గౌడ్, మాజీ అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు సతీశ్, మోర్చా నాయకులు గడ్డం కాశీనాథ్ పాల్గొన్నారు.
