విజయవాడలో మళ్ళీ హైటెన్షన్... వైసీపీ, టీడీపీ పోటాపోటీ నినాదాలతో ఉద్రిక్తత..

విజయవాడలో మళ్ళీ హైటెన్షన్... వైసీపీ, టీడీపీ పోటాపోటీ నినాదాలతో ఉద్రిక్తత..

ఏపీలో డీఎస్సీ 2025 నియామకాలపై సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష వైసీపీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు పొలిటికల్ హీట్ పెంచుతున్నాయి. విజయవాడలో వైసీపీ దీక్షా శిబిరం దగ్గర టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ హంగామా చేసిన సంగతి తెలిసిందే. శుక్రవారం ( ఆగస్టు 7 ) విజయవాడలో మళ్ళీ ఉద్రిక్తత చోటు చేసుకుంది. బాప్టిస్ట్ నగర్‌లోని వైసీపీ దీక్షా శిబిరం దగ్గర హల్చల్ చేశారు టీడీపీ నేతలు.

వైసీపీకి వ్యతిరేకంగా నిరసనకు దిగారు టీడీపీ నేతలు. ఈ క్రమంలో పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదానికి దిగారు టీడీపీ నేతలు. జై జగన్ అంటూ వైసీపీ నేతలు, జై లోకేష్ అంటూ టీడీపీ నేతలు పోటాపోటీ నినాదాలు చేశారు. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో వైసీపీ దీక్షా శిబిరం దగ్గరికి  టీడీపీ నేత బుద్ధా వెంకన్న అనుచరులు చేరుకుని నినాదాలు చేశారు ఇరువర్గాలు పోటాపోటీ నినాదాలు చేయడంతో ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ క్రమంలో అప్రమత్తమైన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.