ముంబై: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం సునేత్రా పవార్కు కాంగ్రెస్ పార్టీ షాక్ ఇచ్చింది. బారామతి అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు సునేత్రపై ఆ పార్టీ అభ్యర్థిని ప్రకటించింది. సునేత్ర మంగళవారం నామినేషన్ దాఖలు చేయనున్న తరుణంలో ఆమెపై కాంగ్రెస్ అభ్యర్థిని బరిలోకి దింపింది. అడ్వకేట్ ఆకాశ్ విశ్వనాథ్ మోరే అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సోమవారం ఖరారు చేశారు.
దీంతో అక్కడ రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఈ ఎన్నిక ఏకగ్రీవం అయ్యేలా చూడాలని సునేత్రా పవార్ ముంబై, ఢిల్లీ స్థాయిలో పలువురు కీలక నేతలను కలిసి విన్నవించారు.
మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ హర్షవర్ధన్ సప్కల్‌ను కూడా ఆమె సంప్రదించారు. అయితే, పార్టీ కేంద్ర నాయకత్వం నిర్ణయంలో రాష్ట్ర యూనిట్ జోక్యం చేసుకోవడానికి అవకాశం లేదని సప్కల్ స్పష్టం చేసినట్టు సమాచారం.
