మరికల్, వెలుగు: ఉపాధి హామీ పనులు చేసేందుకు వస్తున్న ప్రతి ఒక్కరూ తమ ఫొటో తీయించుకోవాలని సీఆర్డీ స్టేట్ ప్రోగ్రాం ఆఫీసర్ మురళి కోరారు. సోమవారం నారాయణపేట జిల్లా మరికల్ మండలం తీలేరు గ్రామంలో ఉపాధి పనులను డీఆర్డీవో మొగులయ్యతో కలిసి పరిశీలించారు. ఫొటో దిగేందుకు ఎదురవుతున్న ఇబ్బందులను ఉన్నతధికారుల దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈకేవైసీ చేసుకోవాలని సూచించారు. అనంతరం గ్రామంలో వేసిన సిమెంట్ రోడ్డు పనులను పరిశీలించారు.
ధన్వాడ: మండలంలోని మందిపల్లిలో ఉపాధి హామీ పథకం పనులను స్టేట్ ప్రోగ్రామింగ్ ఆఫీసర్ మురళి పరిశీలించారు. నీటి నిల్వ పనులను పరిశీలించి, కూలీల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మందిపల్లి తండాలో వర్క్ ఐడీ నంబర్ తొలిగించడంతో పంచాయతీ భవనం అసంపూర్తిగా ఉందని, దీనిని వెంటనే పునరుద్ధరించాలన్నారు. ఇన్చార్జి ఎంపీడీవో వెంకటేశ్వర్ రెడ్డి, ఏపీవో సిద్ధేశ్వర్, మందిపల్లి సర్పంచ్ సురేందర్ రెడ్డి పాల్గొన్నారు.
