మీ వల్ల కాకపోతే మేం కల్పించుకుంటం.. బెంగాల్లో సర్‌‌‌‌‌‌‌‌ ప్రక్రియపై సుప్రీంకోర్టు వ్యాఖ్య

మీ వల్ల కాకపోతే మేం కల్పించుకుంటం.. బెంగాల్లో సర్‌‌‌‌‌‌‌‌ ప్రక్రియపై సుప్రీంకోర్టు వ్యాఖ్య

న్యూఢిల్లీ: బెంగాల్‌‌‌‌లో స్పెషల్‌‌‌‌ ఇంటెన్సివ్ రివిజన్‌‌‌‌ (సర్‌‌‌‌‌‌‌‌) చేపడుతున్న అధికారులకు ఎదురవుతున్న బెదిరింపులపై రాష్ట్ర యంత్రాంగం విఫలమైతే తాము జోక్యం చేసుకుంటామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సర్‌‌‌‌‌‌‌‌ను సవాల్‌‌‌‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌‌‌‌ను విచారించిన చీఫ్‌‌‌‌ జస్టిస్ సూర్యకాంత్‌‌‌‌ సోమవారం ఈ వ్యాఖ్యలు చేశారు. 

సర్‌‌‌‌‌‌‌‌ ప్రక్రియలో రాష్ట్ర యంత్రాంగం ఫెయిలైతే, అప్పుడు మేము ఏం చేయాలో చూస్తాం అని చెప్పారు. మాల్దా జిల్లాలో సర్‌‌‌‌‌‌‌‌ ప్రక్రియలో భాగంగా ఏడుగురు జ్యుడీషియల్‌‌‌‌ అధికారులను ఘెరావ్‌‌‌‌ చేసిన నేపథ్యంలో కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ ఘటనపై ఎన్‌‌‌‌ఐఏ విచారణ ప్రారంభించింది. ఇందులో భాగంగా.. ఈ నిరసనలు పథకం ప్రకారం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించింది.