సిరసనగండ్ల హుండీ ఆదాయం రూ.15.85 లక్షలు ; ఆలయ చైర్మన్ డేరం రామశర్మ

సిరసనగండ్ల హుండీ ఆదాయం  రూ.15.85 లక్షలు ; ఆలయ చైర్మన్  డేరం రామశర్మ

వంగూర్, వెలుగు: నాగర్ కర్నూల్  జిల్లా చారకొండ మండలం సిరసనగండ్ల సీతారామచంద్రస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా భక్తులు సమర్పించిన కానుకలను సోమవారం లెక్కించారు. హుండీల ద్వారా రూ 15,85,420 ఆదాయంతో పాటు కేజీన్నర వెండి సమకూరినట్లు ఆలయ చైర్మన్  డేరం రామశర్మ తెలిపారు. ఈవో ఆంజనేయులు, మేనేజర్  నిరంజన్, సర్పంచ్  రామస్వామి, ఉప సర్పంచ్  సురేందర్ రెడ్డి పాల్గొన్నారు.