కోల్బెల్ట్, వెలుగు: మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలో సింగరేణి సెక్యూరిటీ గార్డులు సోమవారం ఆందోళన చేపట్టారు. యాజమాన్యం కొత్త టెండర్లు పిలిచి తమకు ఉపాధి కల్పించాలంటూ 220 మంది గార్డులు ర్యాలీ నిర్వహించారు. మార్కెట్ఏరియాలోని అంబేద్కర్విగ్రహానికి వినతిపత్రం అందించి నిరసన వ్యక్తం చేశారు. వీరికి సీఐటీయూ అనుబంధ సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సంఘం, మున్సిపల్యూనియన్మద్దతు ప్రకటించింది. గార్డులు, లీడర్లు మాట్లాడుతూ.. మందమర్రి ఏరియా పరిధిలో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుల కొత్త టెండర్ అమలువిషయంలో ఆఫీసర్లు, యాజమాన్యం జాప్యం కారణంగా ఉపాధి లేక 220 మంది కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. కొత్త టెండర్పిలిచి పాత గార్డులందరికీ షరతులు లేకుండా విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్చేశారు. సీఐటీయూ లీడర్లు శ్రీనివాస్, రంజిత్, దేవదాస్, రాజలింగు తదితరులు పాల్గొన్నారు.
