ఐసీసీ చైర్మన్‌‌ ఎన్నికల్లో  ఇండియాx పాకిస్తాన్

ఐసీసీ చైర్మన్‌‌ ఎన్నికల్లో  ఇండియాx పాకిస్తాన్

ముంబై: శశాంక్‌ మనోహర్ స్థానంలో కొత్త చైర్మన్‌‌ ఎలక్షన్‌‌ విషయంలో ఇంటర్నేషనల్‌ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఒక అడుగు ముందుకు.. రెండు అడుగులు వెనక్కి వేస్తోంది. ఇలాంటి టైమ్‌‌లో చైర్మన్‌‌ ఎన్నిక అంశంలో ఇండియా, పాకి స్తాన్ పరస్పరం ఢీకొనబోతున్నాయి. పాక్ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) మద్దతున్న ఐసీసీ మెంబర్స్‌ 2/3 మెజారిటీతోనే చైర్మన్‌‌  ఎన్నిక జరగాలని పట్టు బడుతుండగా.. ఇండియా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా సహా పలు బోర్డ్స్ సింపుల్‌ మెజారిటీ చాలంటున్నాయి. ఈ విషయంపై సోమవారం టెలీకాన్ఫరెన్స్‌ ద్వారా ఐసీసీ బోర్డు మీటింగ్‌‌ జరిగినా.. ఎలాంటి నిర్ణయం వెలువడలేదు.

‘ఐసీసీలో 17 ఓట్లున్నాయి.2/3 మె జారిటీతో కొత్త చైర్మన్‌‌ను ఎన్ను కోవాలంటే ప్రధాన పోటీదారుడికి 12 ఓట్లు అవసరం. అదే సింపుల్‌ మెజారిటీతో పని పూర్తి చేయాలని అంటే తొమ్మిది ఓట్లు వచ్చిన ఎవరైనా పదవి చేపట్టొచ్చు ’ అని ఐసీసీ వర్గా లు చెబుతున్నాయి. ఇప్పుడున్న సిచ్యువేషన్‌‌లో గవర్నింగ్‌‌ బాడీ రెండు వర్గాలుగా చీలిపోయింది. ఇండియా, ఇంగ్లండ్‌ , ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా సహా 11 మెంబర్స్‌ ఓ వైపు ఉన్నాయి. దీ నికి బీసీసీఐ మద్దతుంది. ఇక, పీసీబీ మద్దతున్న మరో వర్గంలో  ఐసీసీ తాత్కా లిక చైర్మన్‌‌ ఇమ్రాన్‌‌ ఖవాజా, ఇండిపెండెంట్‌ డైరెక్టర్​ ఇంద్రానూయి, మూడు అసోసియేట్‌ దేశాలు ఉన్నాయి.

దాంతో ఐసీసీలో ఇండియా వర్సెస్‌‌ పాకిస్తాన్ గేమ్‌‌ నడవనుందని, ఇప్పుడు ఏం చేయాలనే దానిపై బీసీసీఐ వెంటనే నిర్ణయం తీసుకోవాలని ఐసీసీ వర్గా లు చెబుతున్నాయి. ‘ చైర్మన్ ఎన్నిక ఎలా ఉండాలన్నదానిపై ఐసీసీ వద్ద క్లియర్​ డె ఫినేషన్‌‌ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో  ఐసీసీ బోర్డు ఒక రిజల్యూషన్‌‌ను పాస్‌‌ చేయాలి. సింపుల్‌ మెజారిటీతో అది జరుగుతుంది. ఇది ఐసీసీ రాజ్యాంగంలో ఒక భాగమే. కాబట్టి వాళ్లు (ఐసీసీ బోర్డు పెద్దలు) అనుకుంటే ఈ సమస్యను సులువుగా పరిష్కరిస్తారు’ అని అంటున్నాయి.