భారత ఆర్మీకి ఎలాంటి నష్టం జరగలేదు.. పాక్ తీవ్రంగా నష్ట పోయింది: కల్నల్ సోఫియా ఖురేషి

భారత ఆర్మీకి ఎలాంటి నష్టం జరగలేదు.. పాక్ తీవ్రంగా నష్ట పోయింది: కల్నల్ సోఫియా ఖురేషి

భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిందని భారత్ అధికారికంగా ప్రకటించింది. ప్రెస్ కాన్ఫెరెన్స్ లో భాగంగా కాల్పుల విరమణ ఒప్పందం గురించి వివరణ ఇచ్చారు భారత అధికారులు. ఈ సందర్భంగా కల్నల్ సోఫియా ఖురేషి సీజ్ ఫైర్ గురించి మాట్లాడారు. భారత్ లో మతసామరస్యం దెబ్బతినేలా పాక్ అసత్య ప్రచారం చేసిందని ఆమె అన్నారు. 

పాక్ చెప్పినట్లు భారత ఆర్మీకి ఎలాంటి నష్టం జరగలేదని తెలిపారు. కానీ నియంత్రణ రేఖ వెంబడి పాక్ తీవ్రం గా నష్టపోయిందని చెప్పారు. పాక్ ఆర్మీ బేస్ లను భారత ఆర్మీ ధ్వంసం చేసిందని తెలిపారు. S-400 ధ్వంసం చేసినట్లు పాక్ అసత్య ప్రచారం చేసిందని, కానీ ఆ వార్తలో నిజం లేదని ఆమె తెలిపారు. 

యూఎస్ మధ్య వర్తిత్వంతో కాల్పుల విరమణ: 

భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి యూఎస్ కృషి చేసిందని భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ తెలిపారు.  పాక్ రక్షణ మంత్రికి తెల్లవారు జామున 3.50 గంటలకు అమెరికా విదేశాంగ మంత్రి ఫోన్ చేశారని తెలిపారు. అదే విధంగా ఇండియా విదేశాంగ మంత్రి జైశంకర్ తో కూడా యూఎస్ విదేశాంగ మంత్రి మాట్లాడారని తెలిపారు. 

ఇండియా పాక్ కాల్పుల విరమణ ఒప్పందాని గురించి విదేశాంగ మంత్రి జైశంకర్ కూడా అధికారికంగా ప్రకటించారు. ఉగ్రవాదంపై భారత వైఖరి ఎప్పటిలాగే ఉంటుందని ఈ సందర్భంగా తెలిపారు. ఉగ్రవాద నిర్మూలన కోసం ఇప్పటి వరకు చేపట్టిన చర్యలను కొనసాగిస్తామని చెప్పారు. 

మా మధ్య వర్తిత్వంతోనే కాల్పుల విరమణ:

తమ మధ్య వర్తిత్వంతోనే భారత్-పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిందని యూఎస్ ప్రసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. రాత్రంతా భారత్, పాక్ లతో చర్చలు జరిగాయని..  చర్చలు ఫలించి ఇరు దేశాలు శాంతి చర్చలకు ఒప్పుకున్నాయని అన్నారు. ఈ సందర్భంగా ఇరు దేశాలకు అభినందనలు చెప్పారు ట్రంప్