H1 B అప్లికేషన్ల జాబితాలో ఇండియన్ కంపెనీలు వెనక్కి

H1 B  అప్లికేషన్ల జాబితాలో ఇండియన్ కంపెనీలు వెనక్కి

న్యూఢిల్లీ: హెచ్​1బీ వీసాల వాడకాన్ని భారతీయ కంపెనీలు ఈ ఏడాది తగ్గించుకున్నాయి. నిరుటితో పోలిస్తే ఈసారి హెచ్ 1బీ వీసా అప్లికేషన్లను ఇండియన్  కంపెనీలు 37% తగ్గించుకున్నాయని బ్లూమ్​బర్గ్ ఒక నివేదిక విడుదల చేసింది. 

టెక్నాలజీలు మార్పులు, అమెరికా వర్కర్లను ఇండియన్ కంపెనీలు ఎక్కువగా నియమించుకోవడం, అమెరికా బయటి నుంచి కూడా ఉద్యోగులు పనిచేయడం వంటి కారణాలతో ఈసారి హెచ్ 1బీ వీసా దరఖాస్తులకు ఇండియన్  కంపెనీల డిమాండ్  తగ్గిందని వెల్లడించింది.

 2025లో హెచ్ 1బీ వీసా కోసం ఇండియన్  కంపెనీలు చేసుకున్న దరఖాస్తుల్లో 4,573 అప్లికేషన్లను మాత్రమే ఆమోదించారు. ఇక అమెజాన్, మెటా, మైక్రోసాఫ్ట్, గూగుల్  సంస్థలు హెచ్1బీ వీసా కోసం దరఖాస్తు చేసిన కంపెనీల్లో టాప్​లో ఉన్నాయి.