
న్యూఢిల్లీ: దేశ రక్షణ రంగ ఉత్పత్తుల విలువ 2024–25 ఆర్థిక సంవత్సరంలో రూ.1.51 కోట్లకు చేరిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే 18 శాతం వృద్ధి నమోదు చేసి ఆల్ టైమ్ హైగా నిలిచిందన్నారు. గత ఏడాది రక్షణ రంగ ఉత్పత్తుల విలువ రూ.1.27 లక్షల కోట్లుగా ఉండగా.. ఈ ఆర్థిక సంవత్సరంలో అది రూ.1,50,590 కోట్లకు ఎగబాకినట్లు చెప్పారు. ఇక 2019-–20 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 90 శాతం వృద్ధి కనిపించిందన్నా రు.
డిఫెన్స్ పీడీఎస్లు, ఇతర పీడీఎస్లు కలిసి 77 శాతం ఉత్పత్తి నమోదు చేయగా, ప్రైవేటు రంగం మిగతా 23 శాతం వాటా కలిగి ఉన్నట్లు తెలిపారు. 2023-–24లో 21 శాతంగా ఉన్న ప్రైవేటు రంగం వాటా 2024–25 నాటికి 23 శాతానికి పెరిగిందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఆత్మ నిర్భర్ భారత్ చొరవతో రక్షణ రంగ తయారీలో దేశ స్వావలంభన దిశగా సాగుతున్నట్లు తెలిపారు.