ఇద్దరు ఇండియన్ జర్నలిస్టులకు పులిట్జర్

ఇద్దరు ఇండియన్ జర్నలిస్టులకు పులిట్జర్

న్యూఢిల్లీ/న్యూయార్క్: సైబర్ నేరాలు, ఆన్​లైన్​ స్కాంలను వెలికితీసినందుకు గానూ భారతీయ జర్నలిస్టులు ఆనంద్​ఆర్కే, సుపర్ణా శర్మ ప్రతిష్టాత్మక పులిట్జర్​అవార్డుకు ఎంపికయ్యారు. న్యూయార్క్  కొలంబియా వర్సిటీలో పులిట్జర్ ప్రైజ్ బోర్డు సోమవారం అధికారికంగా విజేతలను ప్రకటించింది. 

జర్నలిజం, సాహిత్యం, సంగీతం వంటి విభాగాల్లో ప్రతిభ కనబరిచిన వారికి ఈ అవార్డు అందిస్తున్నారు.  భారత్ లోని కాల్ సెంటర్ల ద్వారా జరుగుతున్న అంతర్జాతీయ సైబర్ నేరాలు, అమాయకులను మోసం చేస్తున్న తీరుపై ఆనంద్​, సుపర్ణ  లోతైన పరిశోధన చేశారు. ఈ నేరాల నెట్‌‌వర్క్ ను ఛేదించడంలో వీరి కథనాలు కీలక పాత్ర పోషించాయని బోర్డు ప్రశంసించింది.