అద్భుతానికే అద్భుతం.. తలలు అతుక్కుని పుట్టిన కవలలు.. AI సాయంతో వేరు చేసిన డాక్టర్లు

అద్భుతానికే అద్భుతం.. తలలు అతుక్కుని పుట్టిన కవలలు.. AI సాయంతో వేరు చేసిన డాక్టర్లు

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రతి రంగంలో అద్భుతాలు సృష్టిస్తోంది. మనిషి చేయలేని పనిని.. మనిషి సృష్టించిన కృత్రిమ మేధ చేస్తూ.. ఒక రకంగా మాయ చేస్తోందనే చెప్పాలి. లేటెస్టుగా.. ఒక డాక్టర్ కు సాధ్యం కాని సర్జరీని ఈజీగా చేసేలా చేసింది. రెండు తలలు అతుక్కుని పుట్టిన కవలలను వేరు చేయడంలో కీలక పాత్ర పోషించింది. రెండు తలలను వేరు చేసి ఆ ట్విన్స్ కు పునర్జన్మ ప్రసాదించడంతో.. ఇప్పుడు సోషల్ మీడియాలో, ప్రపంచ వ్యాప్తంగా ఈ న్యూ్స్ వైరల్ గా మారింది. 

నైజీరియాలోని ఎకిటి స్టేట్ కు చెందిన మెర్సీ, గుడ్ నెస్ అనే ఇద్దరు అక్కా చెల్లెళ్లను ఏఐ టెక్నిక్ తో వేరు చేశారు డాక్టర్లు. 2023 జూన్ లో పుట్టిన ఈ అవిభక్త కవలను.. సర్జరీ కోసం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు తీసుకెళ్లారు పేరెంట్స్. ఇద్దరినీ వేరు చేసే నాటికి వాళ్ల వయసు 19 నెలలు. సర్జరీ తర్వాత కోలుకోవడంతో మళ్లీ నైజీరియాకు చేరుకున్నారు. వైద్య చరిత్రలోనే ఇదొక మైలురాయిగా నిలుస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. 

మెర్సీ, గుడ్‌నెస్ జూన్ 2023లో నైజీరియాలోని ఎకిటి రాష్ట్రంలో, అతుక్కుపోయిన పుర్రెలు, కలిసి పోయిన మెదడు , కలిసిన రక్త నాళాలతో జన్మించారు. ఇలా పుట్టిన వారిని క్రానియోపాగస్ కవలలు అంటారు.  క్రానియోపాగస్ కవలలపై దృష్టి సారించి.. వారికి చికిత్స అందించే UK స్వచ్ఛంద సంస్థ జెమిని అన్‌ట్వైన్డ్ కు 6 నెలల వయసు ఉన్నపుడు డాక్టర్లు సిఫార్సు చేశారు. 

క్రానియోపాగస్ కవలలు చాలా అరుదుగా ఉంటారు.  కేవలం 5 శాతం కవలలు మాత్రమే తల పైభాగంలో అతుక్కుని పుడతారు.  లండన్‌లోని గ్రేట్ ఓర్మాండ్ స్ట్రీట్ హాస్పిటల్ ప్రకారం , ప్రతి 25 లక్షల డెలివరీలు జరిగితే అందులో ఒకరికి ఇలాంటి సమస్య వస్తుంటుందని తెలిపారు. అంటే ప్రతి 25 లక్షల జనానాలకు ఒకసారి ఇది సంభవిస్తుంది.  ఇలా పుట్టిన వారిలో40 శాతం మంది చనిపోయి పుడతారు లేదా డెలివరీ సమయంలో మరణిస్తారు. మరో మూడో వంతు మంది పుట్టిన 24 గంటలలోపే చనిపోతారు. 

జెమిని అన్‌ట్వైన్డ్ ప్రకారం, 2025లో మెర్సీ, గుడ్‌నెస్ సర్జరీ కోసం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని అబుదాబికి వెళ్లారు. SEHA షేక్ ఖలీఫా మెడికల్ సిటీలో నాలుగు నెలల వ్యవధిలో అనేక సర్జరీలు చేయించుకున్నారు. 

60 మంది వైద్యులు.. 40 గంటల ఆపరేషన్:

అవిభక్త కవలలను వేరు చేసేందుకు యుఏఈ, యూకే, నైజీరియా, బ్రెజిల్‌ దేశాలకు చెందిన 60 మందికి పైగా వైద్యులు పనిచేశారు. క్రానియోపాగస్ కవలలను వేరు చేయడం చరిత్రలో ఇది కేవలం తొమ్మిదవ ఘటన కావడం గమనార్హం. ఈ ఆపరేషన్ పూర్తయ్యేందుకు మొత్ం 40 గంటలకు పైగా పట్టింది. ఇందులో కీలకమైన చివరి సర్జరీ12 గంటల పాటు కొనసాగినట్లు డాక్టర్లు చెప్పారు. 

►ALSO READ | పింపుల్స్ పోతాయని రోజుకు రెండుసార్లు ఫేస్ వాష్?.. సబ్బుతో ముఖం కడుక్కుంటే మరిన్ని సమస్యలు!

జెమిని అన్‌ట్వైన్డ్ ప్రకారం, మెర్సీ, గుడ్‌నెస్‌లకు 19 నెలల వయస్సు ఉన్నప్పుడు సర్జరీ ద్వారా వేరుచేశారు. అప్పటి నుంచి అబ్జర్వేషన్ లోనే ఉంటూ.. ఇన్నాళ్లకు కోలుకున్నారు. దీంతో ఆ అమ్మాయిలు ఇప్పుడు నైజీరియాలోని తమ ఇంటికి తిరిగి వచ్చారు. 

ఈ శస్త్రచికిత్సలో కృత్రిమ మేధస్సుతో (AI) కూడిన అనేక కొత్త, అడ్వాన్స్డ్ టెక్నిక్స్ లను ఉపయోగించారు. బీబీసీ రిపోర్ట్ ప్రకారం , సర్జన్స్ .. మిక్స్‌డ్ రియాలిటీలో రిమోట్‌గా సర్జరీని భవిష్యత్తులో అభ్యాసం చేయడానికి వీలుగా, ఆ కవలల మెదళ్ల చిత్రాలను స్కాన్ చేశారు.