బషీర్బాగ్, వెలుగు: రాష్ట్రంలో డాక్టర్లపై జరుగుతున్న వరుస దాడులను నిరసిస్తూ కోఠిలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కిషన్, ఆర్గనైజేషన్ చైర్మన్ డాక్టర్ ప్రభు కుమార్ మాట్లాడుతూ.. డాక్టర్ల రక్షణ కోసం తక్షణమే కఠినమైన చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా దాడులకు పాల్పడే వారిపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని, ఆసుపత్రుల చుట్టూ 100 మీటర్ల పరిధిని ‘వైలెన్స్ ఫ్రీ జోన్’గా ప్రకటించి భద్రత కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
