V6 News

మిరాజ్ యుద్ద విమానం ప్రత్యేకతలు

మిరాజ్ యుద్ద విమానం ప్రత్యేకతలు

Indian mirage 2000 fighter jet specificationsపాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ లో ఉగ్రవాద శిబిరాలను నేలమట్టం చేసిన మిరాజ్ యుద్ద విమానాలపైనే ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. చిమ్మ చీకటిలో కూడా లక్ష్యాలను చేధించి ధ్వంసం చేసే మిరాజ్ యుద్ధ విమానాలను డసాల్ట్ ఏవియేషన్ లైసెన్స్ తో హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తయారు చేసింది. గంటకు 2 వేల 795 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది మిరాజ్ యుద్ద విమానం. సుఖోయ్ అత్యధిక వేగం గంటకు 2 వేల 120 కిలోమీటర్లు మాత్రమే. నిమిషాల వ్యవధిలోనే శత్రు స్థావరాలపై బాంబుల వర్షం కురిపిస్తుంది. ఒక్క నిమిషంలో 12 వందల నుంచి 1800 రౌండ్ల ఫిరంగుల్ని పేల్చగలదు. మిరాజ్ ఆకాశం నుంచి ఆకాశంలోకి బాంబుల్ని వేయవచ్చు.

ఇజ్రాయెల్ టెక్నాలజీ లైటింగ్ తో.. శత్రువుల్ని ఆటోమేటిక్ గా గుర్తించగలిగే సామర్థ్యం ఉంది. యుద్ధ క్షిపణులు, మ్యాజిక్ 2 యుద్ధ క్షిపణులను కూడా మిరేజ్ మోసుకెళ్లగలదు. భూమికి దాదాపు 17కిలోమీటర్ల ఎత్తులో మిరాజ్ ప్రయాణించగలదు. భూమికి అతితక్కువ ఎత్తులో అత్యధిక వేగంతో కూడా ప్రయాణించగలదు. ఈ సమయంలో రాడార్లలో దీనిని గుర్తించడం శత్రుశిబిరానికి కష్టంగా మారిపోతుంది. లేజర్ గైడెడ్ బాంబులను కూడా మిరాజ్  ప్రయోగించగలదు.

1970ల్లో ఫ్రాన్స్ కు చెందిన డసాల్ట్ ఏవియేషన్ ఈ తక్కువ బరువు ఉన్న మిరాజ్-2000 ఫైటర్ జెట్స్ ను తొలిసారి తయారు చేసింది. 1985లో భారత వాయుసేనలో చేర్చారు. దీనికి వజ్ర అనే పేరుపెట్టారు. 1999 కార్గిల్ యుద్ధంలో మిరాజ్ యుద్ధ విమానం కీలకపాత్ర పోషించింది.  ప్రస్తుతం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దగ్గర 50 మిరాజ్ లు ఉన్నాయి. మెరుపు దాడులకు మిరాజ్ నే భారత వాయుసేన ఎంచుకొంటుంది. దీనికి తగ్గట్టే కేవలం 21 నిమిషాల్లోనే బాలాకోట్ లో శత్రు స్థావరాలను ధ్వంసం చేసి క్షేమంగా తిరిగి వచ్చాయి మిరాజ్ యుద్ధవిమానాలు. మిరాజ్ కు పోటీగా పాకిస్తాన్ ఎఫ్ 16 విమానాలను రంగంలోకి దించినా.. మిరాజ్ తో పోటీ పడలేక తిరిగి వెళ్లిపోయాయి.