ఇండియన్ నేవీ చరిత్రలో ఫస్ట్ టైమ్: ఒకేసారి రెండు యుద్ధ నౌకలు జాతికి అంకితం చేసిన రాజ్‎నాథ్ సింగ్

ఇండియన్ నేవీ చరిత్రలో ఫస్ట్ టైమ్: ఒకేసారి రెండు యుద్ధ నౌకలు జాతికి అంకితం చేసిన రాజ్‎నాథ్ సింగ్

న్యూఢిల్లీ: ఇండియన్ నేవీ మరింత పటిష్టం కానుంది. నేవీ అమ్ములపొదిలోకి మరో రెండు యుద్ధ నౌకలు చేరాయి. దేశ రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ మంగళవారం (ఆగస్ట్ 26) రెండు యుద్ధ నౌకలను జాతికి అంకితం చేశారు. ఐఎన్ఎస్ హిమగిరి, ఐఎన్ఎస్ ఉదయగిరి వార్ షిప్‎లు సముద్ర జలాల్లో ప్రవేశించేందుకు ఆయన పచ్చజెండా ఊపారు. ఇండియన్ నేవీ చరిత్రలో ఒకేసారి రెండు యుద్ధ నౌకలను జాతికి అంకితం చేయడం ఇదే తొలిసారి.

 ఐఎన్ఎస్ హిమగిరి, ఐఎన్ఎస్ ఉదయగిరి దేశంలో రెండు వేర్వేరు షిఫ్ యార్డులో నిర్మించిన రెండు ఫ్రంట్ లైన్ సర్ఫే్స్ యుద్ధ నౌకలు. హిమగిరిని కోల్‌కతాలోని గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్, ఉదయగిరి వార్ షిప్‎ను ముంబైలోని మజగాన్ డాక్ షిప్‌బిల్డర్స్ నిర్మించారు. వీటి డిజైన్, స్టెల్త్, ఆయుధాలు, సెన్సార్ వ్యవస్థల్లో అత్యాధునిక సాంకేతిక  ఉపయోగించి తయారు చేశారు. 

మేకిన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా ఈ రెండు యుద్ధ నౌకలను 75 శాతం స్వదేశీ పరికరాలతోనే తయారు చేశారు. దీనితో దేశ పారిశ్రామిక-సాంకేతిక సామర్థ్యం, స్వదేశీ సామర్థ్యం ద్వారా ప్రాంతీయ శక్తి సమతుల్యతను ప్రదర్శించే మూడు యుద్ధనౌకల స్క్వాడ్రన్‌ను నేవీ కలిగి ఉంది. హిమగిరి, ఉదయగిరి రాకతో నేవీ పోరాట సంసిద్ధత మరింత పెరుతుందని అధికారులు ధీమా వ్యక్తం చేశారు. 

INS ఉదయగిరి పూర్తి వివరాలు:

  • ముంబైకి చెందిన మజగావ్ డాక్ షిప్‌బిల్డర్స్ ఐఎన్ఎస్ ఉదయగిరిని తయారు చేసింది
  • దీని 149 మీటర్ల పొడవు. గరిష్ట వేగం 28 నాట్లు అంటే గంటకు 52 కి.మీ.
  • ఆయుధాలలో 48 బరాక్-8 క్షిపణులు, ఎనిమిది బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్షిపణులు ఉన్నాయి.
  • రెండు హెలికాప్టర్లను నడపగలదు
  • డీజిల్ ఇంజన్లు, గ్యాస్ టర్బైన్ల ద్వారా శక్తిని పొందుతాయి. 

INS హిమగిరి డిటెయిల్స్:

  • కోల్‌కతాకు చెందిన గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ INS హిమగిరిని తయారు చేసింది
  • దీని 149 మీటర్ల పొడవు. గరిష్ట వేగం 28 నాట్లు అంటే గంటకు 52 కి.మీ. 
  •  రెండు హెలికాప్టర్లను కూడా మోసుకెళ్లగలదు.
  • ఆయుధాలలో 32 బరాక్-8 క్షిపణులు, ఎనిమిది బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్షిపణులు ఉన్నాయి.
  • మారేచ్ టార్పెడో డికాయ్ వ్యవస్థను కలిగి ఉంది.

  •