క్వాలిటీ లేని ఫుడ్.. ఐసీసీకి టీమిండియా ఫిర్యాదు

క్వాలిటీ లేని ఫుడ్.. ఐసీసీకి టీమిండియా ఫిర్యాదు

టీ20  ప్రపంచ కప్ కోసం ఆస్ట్రేలియాలో ఉన్న టీమిండియా  ఇవాళ ప్రాక్టీస్ సెషన్ లో పాల్గొనకూడదని నిర్ణయించింది. ప్రాక్టీస్ కోసం సిడ్నీ శివారుల్లోని బ్లాక్ టౌన్ లో గ్రౌండ్ కేటాయించడంపై టీమ్ అసంతృప్తిగా ఉంది.  ప్రస్తుతం భారత్ క్రికెటర్లు ఉండే హోటల్ రూమ్ కి 42 కిలోమీటర్ల దూరంలో ప్రాక్టీస్ గ్రౌండ్ ఉంది.  దీనికితోడు ఇచ్చిన ఫుడ్ పైనా అసంతృప్తిగా ఉన్నారు.  తమకు సరైన ఆహారం పెట్టకుండా శాండ్ విచ్ లు మాత్రమే ఇవ్వడంపై  క్రికెటర్లు  ICC కి కూడా ఫిర్యాదు చేశారు. అవి చల్లగా ఉన్నాయనీ... క్వాలిటీ లేవని కంప్లయింట్ ఇచ్చారు.

T20 ప్రపంచ కప్ సూపర్  12లో భాగంగా భారత్ జట్టు రేపు మధ్యాహ్నం నెదర్లాండ్స్ తో సిడ్నీలో తలపడనుంది. నెదర్లాండ్స్‌ను చిత్తు చేసి సెమీస్‌కు వెళ్లేందుకు మార్గం సుగమం చేసుకోవాలని భావిస్తోంది. ఈ మ్యాచ్‌ తరువాత దక్షిణాఫ్రికా, జింబాబ్వే, బంగ్లాదేశ్ జట్లతో పోటీపడనుంది.

ఆదివారం జరిగిన తొలి లీగ్ మ్యాచ్‌‌‌‌లో టీమిండియా 4 వికెట్ల తేడాతో పాక్‌‌‌‌ను ఓడించింది. టాస్‌‌‌‌ ఓడి బ్యాటింగ్‌‌‌‌కు దిగిన పాకిస్తాన్‌‌‌‌ 20 ఓవర్లలో 159/8 స్కోరు చేసింది. 160 పరుగుల టార్గెట్ బరిలోకి దిగిన టీమిండియాను విరాట్ కోహ్లీ గెలిపించాడు.  దాదాపు 13 ఓవర్లు క్రీజులో ఉన్న కోహ్లీ–-పాండ్యా ఐదో వికెట్‌‌‌‌కు 113 రన్స్‌‌‌‌ జోడించి ఇండియాను నిలబెట్టారు. కోహ్లీకి ‘ప్లేయర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌’ అవార్డు లభించింది.