
కరీంనగర్: జగన్ దేశ రాజకీయాలకు రోల్ మోడల్ గా మారారన్నారు కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి. శుక్రవారం జగిత్యాలలో మాట్లాడారు జీవన్ రెడ్డి. పార్టీ ఫిరాయింపుల విషయంలో జగన్ ను చూసైనా కేసీఆర్ మారాలి. ప్రతిపక్షం లేకుంటే నియంతృత్వం రాజ్యమేలుతోంది. ఫిరాయింపుల విషయంలో కేసీఆర్ పునరాలోచించాలి. పార్టీ మారిన ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి. విద్యా వ్యవస్థను ప్రభుత్వం నిర్వీర్యం చేసింది.
బడ్జెట్లో విద్యాశాఖకు కేటాయింపులు తగ్గించారు. కేజీ టు పీజీని కనుమరుగు చేసే కుట్ర చేస్తున్నారు. ప్రభుత్వమే ప్రాథమిక పాఠశాలలను నిర్వీర్యం చేస్తోంది. తెలంగాణలో విద్యాహక్కు చట్టం అమలు చేయాలి. డీఎస్సీ ఊసే లేదు. టీచర్ల సంఖ్య ఎక్కువగానే ఉందని విద్యామంత్రి చెప్పడం హాస్యాస్పదం. టీఆర్టీ సెలక్ట్ ఆభ్యర్థులపై లాఠీ ఛార్జీ చేయడం ఖండిస్తున్నానని తెలిపారు జీవన్ రెడ్డి.