టైటిల్ : ఇండియన్ ప్రిడేటర్ : ది బుచర్ ఆఫ్ ఢిల్లీ, డైరెక్షన్ : ఆయేషా సూద్, కాస్టింగ్ : సుందర్ సింగ్, హర్గోబిందర్ సింగ్, అమిత్ కుమార్ ఝా, ఉత్కర్ష్ ఆనంద్, అఖిలేష్ శర్మ, లాంగ్వేజ్ : హిందీ, ఇంగ్లీష్, తెలుగు, తమిళం, కన్నడ, ప్లాట్ ఫాం : నెట్ ఫ్లిక్స్, రన్ టైం : మూడు ఎపిసోడ్లు (ఒక్కోటి 40–50 నిమిషాలు)
ఒక హంతకుడు వరుస హత్యలు చేస్తుంటాడు. శవాల బాడీ పార్ట్స్ మూట కట్టి అందరికీ తెలిసేలా పడేస్తాడు. అంతేకాకుండా, ఆ మూటలో పోలీసులకు సవాల్ విసురుతూ ఒక లెటర్ పెడతాడు. ఇది కథ కోసం రాసుకున్న క్యారెక్టర్ కాదు. ఢిల్లీలో హత్యలు చేసిన ఒక కిల్లర్ రియల్ స్టోరీ. మరి పోలీసులు అతన్ని పట్టుకున్నారా? లేదా? ఆ హత్యలు ఎందుకు చేశాడు? అతని మానసిక పరిస్థితి ఏంటి? ఇన్వెస్టిగేషన్లో తెలిసిన నిజాలేంటి? వంటి విషయాలు తెలియాలంటే మూడు ఎపిసోడ్ల ఈ డాక్యుమెంటరీ తప్పక చూడాల్సిందే. ఈ సిరీస్‌లో అందరి యాక్టింగ్ బాగానే ఉంది. క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టపడేవాళ్లకు బాగా నచ్చుతుంది. చివరిగా.. సమాజంలో ఇతరుల పట్ల ఒక్కొక్కరి ప్రవర్తన ఎలా ఉంది? సామాన్యులు క్రిమినల్స్‌గా మారడానికి గల కారణాలు ఏంటి? వంటి కొన్ని ముఖ్యమైన పాయింట్స్ ఈ డాక్యుమెంటరీలో చూపించారు.
