మోదీ నాయకత్వంలోనే ఇండియన్ రైల్వే అభివృద్ధి : కిషన్ రెడ్డి

మోదీ నాయకత్వంలోనే ఇండియన్ రైల్వే అభివృద్ధి : కిషన్ రెడ్డి

ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ఇండియన్ రైల్వే అభివృద్ధి చెందిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు.  రైల్వే వ్యవస్థలో సమూల మార్పులు జరుగుతున్నాయని వెల్లడించారు.  2014 నుంచి- 2023కు మధ్య రైల్వే శాఖకు బడ్జెట్ కు 17రేట్లు పెరిగిందన్నారు.  నాంపల్లి రైల్వే స్టేషన్ కు ఆధునికీకరణ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.  రైల్వే అభివృద్ధి కోసం 30వేల కోట్ల రూపాయలను తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం ఇచ్చిందన్నారు.  2023 పూర్తి అయ్యే వరకు తెలంగాణలోని అన్ని రైల్వే లైన్స్ ను ఎలక్ట్రిక్ చేయాలని కేంద్రం.టార్గెట్ గా పెట్టుకుందని చెప్పుకొచ్చారు. 

హైదరాబాద్ నుంచి యాద్రాద్రి వరకు MMTS ను రూ. 3వందల కోట్లతో నిర్మించబోతున్నామని కిషన్ రెడ్డి చెప్పారు.  సికింద్రాబాద్ లో అభివృద్ధి పనుల కోసం కేంద్రం రూ. 7వందల కోట్లు కేంద్రం ఇచ్చిందన్నారు.  3వందల కోట్లతో  కాచిగూడ రైల్వే స్టేషన్ అభివృద్ధి జరుగుతోందని,  స్వదేశీ టెక్నాలజీ తో ప్రమాదాలను అరికట్టేందుకు కవచ్ వ్యవస్థను దేశంలోనే మొదటిసారి తెలంగాణ అందుబాటులోకి తెచ్చామని వెల్లడించారు.  రూ. 25వేల కోట్లతో 508 రైల్వే స్టేషన్స్ పునరుద్ధరణ పనులను ప్రధాని మోదీ ఇవాళ ప్రారంభించనున్నారని  తెలిపారు.