దుబాయ్: హార్మూజ్ జలసంధి సమీపంలో శుక్రవారం ఓ బోట్లో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంలో ఓ భారతీయ నావికుడు ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది గాయాలపాలయ్యారు. భారతీయ సిబ్బందితో ప్రయాణిస్తున్న ఒక చెక్క బోటు ఒక్కసారిగా మంటల్లో చిక్కుకుంది. పడవలో 18 మంది భారతీయ సిబ్బంది ఉండగా.. వారిలో ఒకరు మరణించారు. మరో నలుగురు గాయపడ్డారు.
ప్రమాదం జరిగిన వెంటనే అటుగా వెళ్తున్న మరో నౌకలోని సిబ్బంది స్పందించి వారిని రక్షించారు. గాయపడిన వారంతా ప్రస్తుతం దుబాయ్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సాధారణ సరుకు రవాణా చేస్తున్న ఈ పడవకు మంటలు అంటుకోవడంతో సముద్రంలో మునిగిపోయింది. అమెరికా, ఇరాన్ బలగాల మధ్య జరిగిన కాల్పులు కారణంగానే ఈ బోటులో మంటలు చెలరేగినట్టు సమాచారం.
