మహిళలు తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో మహిళా సాధికారత, ఉద్యోగ-ఉపాధి అవకాశాలు, 'రూరల్ విమెన్ గ్లోబల్ ఇంపాక్ట్' వంటి కీలక అంశాలే ఎజెండాగా జూబ్లీహిల్స్ కన్వెన్షన్ సెంటర్‌లో వేట (విమెన్ ఎంపవర్‌మెంట్ తెలుగు అసోసియేషన్ - WETA) ఇండియా చాప్టర్ లాంచ్ , విమెన్ ఎంపవర్‌మెంట్ సమ్మిట్ జరిగింది. వేట సంస్థ ఫౌండర్ హనుమండ్ల ఝాన్సీ రెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ సదస్సుకు భారీ సంఖ్యలో మహిళలు, విద్యార్థినులు తరలివచ్చారు.ఈ కార్యక్రమానికి మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, గడ్డం వివేక్ వెంకటస్వామి, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్, టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి వివేక్ వెంకటస్వామి మహిళా సాధికారతపై,తన వ్యక్తిగత జీవితంలోని మహిళల పాత్రపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు .మహిళలు, విద్యార్థినులను వివిధ రంగాల్లో సాధికారత వైపు నడిపించేందుకు వేట సంస్థను భారత్‌లో ప్రారంభించి, వారికి తోడ్పాటు అందించడం చాలా గొప్ప విషయం. సంస్థ ఫౌండర్ ఝాన్సీ రెడ్డి మహిళల కోసం చేస్తున్న కృషి ప్రశంసనీయం.
కేవలం ఒక గృహిణిగా ఉండి, అవకాశం వచ్చినప్పుడు చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యేగా రాణిస్తున్న యశస్విని రెడ్డి ప్రయాణం అద్భుతం. ఆమె సమస్యలను ఎదుర్కోవడంలో, విమర్శలకు దీటుగా సమాధానం ఇవ్వడంలో దిట్ట. ఆమె ఒక వెరీ గుడ్ పొలిటీషియన్. అలాగే కల్వకుంట్ల కవిత కూడా రాజకీయాల్లో ఎంతో చక్కగా రాణిస్తున్నారు. నా సతీమణి గడ్డం సరోజ విద్యా రంగంలో విజయవంతంగా రాణిస్తున్నారు. నా కూతుళ్లు, కోడళ్లు కూడా వర్కింగ్ విమెన్‌గా స్థిరపడ్డారు. మహిళలు ఇప్పుడు అన్ని రంగాల్లోనూ తమ సత్తా చాటుతున్నారు.
మా ఇంట్లో మా వైఫ్ మై బాస్. మహిళల సక్సెస్ వెనుక పురుషుల ప్రోత్సాహం తప్పకుండా ఉండాలి. మగవారు మహిళల సమయంపై ఎలాంటి ఆంక్షలు పెట్టకుండా, వారి కష్టాన్ని గుర్తిస్తూ, వారి పనుల్లో తోడుగా ఉండి ప్రోత్సహించాలి. కుటుంబాన్ని సమర్థవంతంగా నడిపించే మహిళల గొంతుక ఎప్పుడూ డైనమిక్‌గా వినబడాలి.చివరగా, మహిళల ప్రగతికి బాటలు వేస్తున్న వేట తెలంగాణ చాప్టర్కు మంత్రి వివేక్ వెంకటస్వామి హృదయపూర్వక ఆల్ ది బెస్ట్ తెలియజేశారు.
