ఇరాన్‌‌లో 3 వేల మంది అరెస్టు... యుద్ధ సమయంలో ఇజ్రాయెల్ కు సాయం చేశారని ఆరోపణలు

ఇరాన్‌‌లో 3 వేల మంది అరెస్టు... యుద్ధ సమయంలో ఇజ్రాయెల్ కు సాయం చేశారని ఆరోపణలు

టెహ్రాన్: యుద్ధ సమయంలో ఇజ్రాయెల్‌‌కు సహకరించారన్న ఆరోపణలపై ఇరాన్​లో భారీ స్థాయిలో అరెస్టులు కొనసాగుతున్నాయి. కొద్ది రోజుల్లోనే మొత్తం 3,292 మందిని అదుపులోకి తీసుకున్నట్లు సోమవారం ఆ దేశ న్యాయవ్యవస్థ వెల్లడించింది. వీరిలో 684 మంది ఇజ్రాయెల్ కోసం కార్యకలాపాలు నిర్వహించారని, మరో 1,258 మంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేశారని పేర్కొంది. 

ఇజ్రాయెల్–అమెరికా దాడులు జరిగిన సమయంలో శత్రువుకు సహకరించారని, దేశ భద్రతకు ముప్పు కలిగించారని అధికారులు ఆరోపిస్తున్నారు.  దేశద్రోహులుగా అనుమానిస్తున్న వందలాది మంది ఆస్తులను ఇప్పటికే స్వాధీనం చేసుకుంది.