ఫెడరేషన్పై చట్టపరమైన చర్యలు.. ఆసియా గేమ్స్ నుంచి తొలగించడంపై మనికా బాత్రా హెచ్చరికలు

ఫెడరేషన్పై చట్టపరమైన చర్యలు.. ఆసియా గేమ్స్ నుంచి  తొలగించడంపై మనికా బాత్రా  హెచ్చరికలు

టేబుల్ టెన్నిస్ స్టార్, యువకులలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న మానికా బాత్రా.. లీగల్ ఫైట్ కు సిద్ధమైనట్లు ప్రకటించింది. ఆసియన్ గేమ్స్ స్క్వాడ్ నుంచి తప్పించడంపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.  భారత ఆసియా క్రీడల జట్టు నుండి తప్పించడంపై క్రీడా సమాఖ్యపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ఇది ఏకపక్ష నిర్ణయమని, దీని వెనుక స్పష్టమైన, నిజమైన కారణమేంటో వివరణ ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు.

అయితే నేషనల్ లెవెల్ ఈవెంట్లలో పాల్గొనాలంటే సెలెక్షన్ గైడ్ లైన్స్  కు తగిన అర్హత సాధించాలని భారత టేబుల్ టెన్నిస్ సమాఖ్య (TTFI) పేర్కొంది.  గైడ్ లైన్స్ సంతృప్తి పరచడంలో విఫలమైనందున, 31 ఏళ్ల ఒలింపియన్‌ ను టీమ్ నుంచి తొలగించి, రిజర్వ్‌లలో చేర్చారు. 

దీనిపై స్పందించిన మానిక బాత్రా.. సెలెక్షన్ రూల్స్ ప్రకారమే ఎంపిక చేసుకోవాలని.. తనును మినహాయించాలని ఏం కోరడం లేదన్నారు. అనవసరంగా తనను తొలగింపుపై మణిక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవియాల్యు జోక్యం చేసుకోవాలని కోరారు.

"గత కొన్ని రోజులుగా, నేను ఆసియా క్రీడల జట్టులో స్థానం ఆశిస్తున్నానని లేదా ప్రత్యేక పరిగణన కోరుతున్నానని చాలా మంది అనడం నేను చూశాను. ఈ విషయాన్ని నేను స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. నన్ను ఎంపిక చేయమని నేను అడగడం లేదు. ఈ నిర్ణయాన్ని మార్చమని నేను ఎవరినీ కోరడం లేదు. నేను సమాధానాలు అడుగుతున్నాను," అని ఆమె ఒక ప్రకటనలో తెలిపారు.

తనను ఎందుకు విస్మరించారనే దానిపై సంతృప్తికరమైన వివరణ లభించకపోతే, న్యాయపరమైన చర్యలతో సహా అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను అనుసరిస్తానని మణిక హెచ్చరించారు. సెలెక్టర్లు చెప్పిన కారణాలు తనను సంతృప్తి పరచలేదని పేర్కొన్నారు. అయితే దేశీయ క్రీడలలో ఎందుకు ఆడలేదనే ప్రశ్నకు.. అంతర్జాతీయంగా తన ఫామ్ చూసి డిసైడ్ చేయాల్సిందిగా వాదించారు. 

ప్రస్తుతం విమెన్స్ సింగిల్స్‌లో వరల్డ్ 51వ ర్యాంక్‌లో ఉన్న  మానిక.. శ్రీజ ఆకుల తర్వాత ఇండియాలో రెండవ అత్యున్నత ర్యాంక్ క్రీడాకారిణిగా ఉన్నారు. అంతర్జాతీయ క్యాలెండర్ నిండిపోవడం వల్ల తాను తిరిగి వచ్చి లోకల్ గేమ్స్ ఆడకపోయినట్ఉల తెలిపారు