అమెరికాలో ఇండియన్‌ స్టూడెంట్ మిస్సింగ్‌

అమెరికాలో ఇండియన్‌ స్టూడెంట్ మిస్సింగ్‌

వాషింగ్టన్‌: అమెరికాలో భారతీయ స్టూడెంట్‌ అదృశ్యమయ్యాడు. కర్నాటకు చెందిన సాకేత్‌ శ్రీనివాసయ్య (22) బర్కిలీలోని కాలిఫోర్నియా యూనివర్సిటీలో కెమికల్‌ అండ్‌ బయోమాలిక్యులర్‌‌ ఇంజనీరింగ్‌ చదువుతున్నాడు. ఫిబ్రవరి 9 నుంచి సాకేత్‌ కనబడకుండా పోయాడని అధికారులు తెలిపారు. చివరిసారిగా యూనివర్సిటీ క్యాంపస్‌కు దాదాపు కిలోమీటర్‌‌ దూరంలో సాకేత్‌ను కనిపించాడని చెప్పారు.

ఈ క్రమంలో క్యాంపస్‌ దగ్గర్లో ఉన్న టిల్డెన్‌ రీజినల్‌ పార్క్‌కు సమీపంలో సాకేత్‌కు చెందిన పాస్‌పోర్ట్, ల్యాప్‌టాప్‌ ఉన్న బ్యాక్‌ప్యాక్‌ గుర్తించినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు.  బర్కిలీహిల్స్‌ చుట్టుపక్కల ప్రాంతాలపై దృష్టి పెట్టినట్లు తెలిపారు.  ఈ ఘటనపై శాన్‌ఫ్రాన్సిస్కోలోని ఇండియన్‌ కాన్సులేట్‌ ఆందోళన వ్యక్తం చేసింది. అతని కుటుంబ సభ్యులకు, స్థానిక అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరపుతున్నట్లు కాన్సులేట్‌ అధికారులు వెల్లడించారు.