క్వింగ్‌డావో (చైనా): ఆసియా బ్యాడ్మింటన్ టీమ్ చాంపియన్‌షిప్‌లో ఇండియా మెన్స్, విమెన్స్ టీమ్స్ శుభారంభం చేశాయి. బుధవారం జరిగిన గ్రూప్–వై తొలి మ్యాచ్‌లో అమ్మాయిల జట్టు 5–-0తో మయన్మార్‌ను చిత్తుగా ఓడించింది. తొలి సింగిల్స్‌లో తన్వీ శర్మ 21–-13, 21–-16తో థుజార్‌ను ఓడించి జట్టుకు శుభారంభం అందించింది.
రక్షిత శ్రీ21–-12, 21–-6తో ఐంట్ చిట్‌పై అలవోకగా నెగ్గగా.. మూడో సింగిల్స్‌లో మాళవిక 21–-19, 21-–12తో లిన్ లిన్ హెట్‌పై నెగ్గి జట్టు విజయం ఖాయం చేసింది. మరోవైపు మెన్స్ గ్రూప్–డి మ్యాచ్‌లో ఇండియా 4–1తో సింగపూర్‌ను ఓడించింది. తొలి సింగిల్స్‌లో లక్ష్యసేన్ మాజీ వరల్డ్ చాంప్ లో కిన్ యివ్ చేతిలో ఓడగా.. కీలకమైన మూడో సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్ 21–15, 21–16తో జి వీ జొయెల్ కొపై గెలిచి ఆకట్టుకున్నాడు.
