ఇండియన్ టెలికాం సర్వీస్ మహిళా డైరెక్టర్ బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. సుతాన్ ఎస్పీ అనే వ్యక్తి న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నట్లుగా బుధవారం (ఏప్రిల్ 15) పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన ఇంటి మీదకి వచ్చి అసభ్యంగా సిగ్నల్ చేస్తున్నాడని ఫిర్యాదలో పేర్కొన్నారు.
ITS (ఇండియా టెలికాం సర్వీస్) డైరెక్టర్ అయిన బాధితురాలు ఐఏఎస్, ఐపీఎస్ క్వార్టర్స్ లో నివాసం ఉంటున్నారు. ఒంటరిగా ఉంటున్న బాధితురాలి ఇంటిముందుకు వచ్చి అభ్యంతరంగా మాట్లాడడంతో పాటు అసభ్యకర రీతిలో సిగ్నల్స్ చేస్తున్నాడని ఫిర్యాదు చేశారు.
సుతాన్ ఎస్పీ అనే వ్యక్తి తన ఇంటి ముందు న్యూసెన్స్ క్రియేట్ చేసి నానా హంగామా చేస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. అందుకు సంబంధించిన వీడియోలను ఆధారాలుగా ఫిర్యాదులో జత పరిచారు. కేస్ నమోదు చేసిన బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

