చరిత్ర సృష్టించిన ఉమెన్స్..ఒలింపియాడ్‌లో కాంస్యం

చరిత్ర సృష్టించిన ఉమెన్స్..ఒలింపియాడ్‌లో కాంస్యం

చెస్ ఒలింపియాడ్లో మనోళ్లు అదరగొట్టారు. సొంత గడ్డపై  పతకాల మోత మోగించారు. కోనేరు హంపి, ఆర్. వైశాలి, తానియా సచ్ దేవ్, భక్తి కులకర్ణితో కూడిన భారత A టీమ్ మహిళల విభాగంలో చివరి రౌండ్ లో అమెరికా చేతిలో 1-3తో ఓడిపోయి బ్రౌంజ్ మెడల్ ను దక్కించుకుంది. హంపీ, వైశాలి తమ గేమ్‌లను డ్రా చేసుకోగా, తానియా సచ్‌దేవ్, భక్తి కులకర్ణి తమ గేమ్‌లను ఓడిపోయారు. దీంతో కాంస్యం సాధించి..  ఒలింపియాడ్‌లో  చరిత్ర సృష్టించింది. ఓపెన్, మహిళల విభాగంలో సంయుక్తంగా బెస్ట్ పెర్ఫామెన్స్‌కుగానూ  భారత్ A టీమ్  గఫ్రిందాష్విలి ట్రోఫీని సొంతం చేసుకుంది.

మరోవైపు ఓపెన్ విభాగంలో భారత  B టీమ్ ఆద్యంతం అద్భుత ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకుంది. డి గుకేష్ , నిహాల్ సరిన్,ప్రగ్నానంద,రౌనక్ సాధ్వానీతో కూడిన  యువ భారత్ B జట్టు జర్మనీని 3-1తో చిత్తు చేసి దేశానికి రెండో కాంస్య పతకాన్ని అందించింది.  2014 ఒలింపియాడ్ లో  కాంస్యం గెలిచిన తర్వాత ఒలింపియాడ్‌లో ఓపెన్ విభాగంలో భారత్‌ కాంస్యం సాధించడం ఇది రెండోసారి. ఓపెన్ విభాగంలో ఉక్రెయిన్‌ స్వర్ణం దక్కించుకుంది. చివరి రౌండ్లో 3-1తో పోలెండ్‌పై విజయం సాధించింది. జార్జియా సిల్వర్ను సొంతం చేసుకుంది. 

భారత్ ఎ టీమ్ అమెరికాను 2-2తో డ్రా చేసుకుంది. హరికృష్ణ, విదిత్ గుజరాతీలు డ్రా చేసుకోగా.. ఎరిగైసీ విజయాన్ని నమోదు చేశాడు. అయితే ఎస్ ఎల్ నారాయణన్ ఓడిపోయాడు.  11వ సీడ్‌గా బరిలోకి దిగిన మేరీ ఆన్‌ గోమ్స్‌, దివ్య,  వంతిక, పద్మిని రౌత్‌లతో కూడిన భారత్ B టీమ్ 8వ స్థానం సాధించింది. ఈషా, నందిద, సాహితి, ప్రత్యూషలతో కూడిన  భారత్‌- C టీమ్ 17వ స్థానంలో నిలిచింది. 

టీమ్ ఈవెంట్‌లలో పతకాల మోత మోగించిన గ్రాండ్ మాస్టర్లు..వ్యక్తిగత ప్రదర్శనలతోనూ భారత్‌కు పతకాల వర్షం కురిపించారు. రెండు స్వర్ణాలు, ఒక రజతంతో పాటు..నాలుగు కాంస్యాలను సాధించారు.   గుకేశ్‌, సరీన్‌ స్వర్ణాలు.. అర్జున్‌ రజతం గెలుచుకున్నారు. ప్రజ్ఞానంద, వైశాలి, తానియా, దివ్య కాంస్యాలు సాధించారు. 

44వ చెస్ ఒలింపియాడ్‌లో ఉజ్బెకిస్తాన్, ఉక్రెయిన్  ఓపెన్, మహిళల విభాగంలో ఛాంపియన్‌లుగా నిలిచాయి. యువ ఉజ్బెకిస్తాన్ జట్టు అర్మేనియాను ఓడించి  అగ్రస్థానంలో నిలిచింది. మెరుగైన టై-బ్రేక్‌లో బంగారు పతకాన్ని గెలుచుకుంది.   రెండు జట్లు 19 పాయింట్లు సాధించడంతో అర్మేనియా రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.