చరిత్ర సృష్టించిన టీమిండియా..తొలిసారి ఆస్ట్రేలియాపై విక్టరీ

చరిత్ర సృష్టించిన టీమిండియా..తొలిసారి ఆస్ట్రేలియాపై విక్టరీ

భారత మహిళా క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. ఆస్ట్రేలియాతో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్ లో 8 వికెట్ల తేడాతో చారిత్రాత్మక విజయం సాధించింది. ఆసీస్ నిర్దేశించిన 75 పరుగుల టార్గెట్ ను రెండు వికెట్లు కోల్పోయి చేధించింది. ఓపెనర్ స్మృతి మందానా 38 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచింది. ఆస్ట్రేలియాపై టెస్టులో భారత్ గెలవడం ఇదే తొలిసారి.

 డిసెంబర్ 21 మొదలైన మ్యాచ్ లో టాస్ గెలిచి ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేసింది.  ఫస్ట్ ఇన్నింగ్స్ లో భారత్ ఆసిస్ ను 219 పరుగులకే ఆలౌట్ చేసింది.  తర్వాత భారత్ మొదటి ఇన్నింగ్స్ లో 406 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఆసిస్ పై భారీ ఆధిక్యాన్ని సాధించింది.  మూడో రోజు  ఆట ముగిసే సరికి 5 వికెట్లు కోల్పోయి 235 పరుగులు చేసిన ఆసిస్ నాల్గో రోజు మరో 28 పరుగులు చేసి  261 పరుగులకు ఆలౌట్ అయ్యింది.  ఆసిస్ నిర్దేశించిన 75 పరుగుల టార్గెట్ ను భారత్  2 వికెట్లు కోల్పోయి  సునాయసంగా  చేధించింది.  దీంతో ఇంకో రోజు మిగిలి ఉండగానే టెస్టు గెలిచింది. ఆస్ట్రేలియాతో భారత్ ఇప్పటి వరకు 10 మ్యాచ్ లు ఆడగా గెలవడం ఇదే మొదటి సారి.