జాగ్రెబ్ : ఇండియా రెజ్లర్ అమన్ షెరావత్.. జాగ్రెబ్ ఓపెన్ ర్యాంకింగ్ సిరీస్ టోర్నీలో గోల్డ్ మెడల్ సాధించాడు. గురువారం జరిగిన మెన్స్ 57 కేజీల ఫైనల్ బౌట్‌లో అమన్ 10–0తో వరల్డ్ ఏడో ర్యాంకర్ వనహో జో (చైనా)పై గెలిచాడు. మ్యాట్‌పై పర్ఫెక్ట్ స్కిల్స్ చూపెట్టిన ఇండియన్ రెజ్లర్లు చైనీస్ ప్లేయర్‌పై పూర్తి ఆధిపత్యం చూపెట్టాడు. దీంతో ఏకపక్షంగా పాయింట్లు సాధించాడు.
అంతకుముందు జరిగిన బౌట్స్‌లో అమన్ 15–4తో ముహమెట్ కరావుస్ (టర్కీ)పై, 11–0తో రిచర్డ్స్ రోడ్స్ (అమెరికా)పై గెలిచి సెమీస్‌లోకి ప్రవేశించాడు. సెమీస్‌లోనూ అమన్ 11–0తో వరల్డ్ 16వ ర్యాంకర్ రోబెర్టి డింగాషివిలి (జార్జియా)ను ఓడించి టైటిల్ ఫైట్‌కు అర్హత సాధించాడు.
మెన్స్ 86 కేజీ తొలి బౌట్‌లో దీపక్ పూనియా.. అజ్మత్ దౌలెట్‌బెకోవ్ (కజకిస్తాన్) చేతిలో ఓడాడు. అజ్మత్ ఫైనల్‌కు వెళ్లడంతో దీపక్‌కు రెప్‌చేజ్ రౌండ్ ఆడే చాన్స్ వచ్చింది. తొలి రౌండ్‌లో నెగ్గినా తర్వాతి రౌండ్లలో ఫెయిలయ్యాడు.
