మన సైన్యం దైర్యాన్ని దెబ్బతీయొద్దు : పహల్గాం పిటీషనర్ పై సుప్రీంకోర్టు ఆగ్రహం

మన సైన్యం దైర్యాన్ని దెబ్బతీయొద్దు : పహల్గాం పిటీషనర్ పై సుప్రీంకోర్టు ఆగ్రహం

పహల్గాం ఉగ్రదాడిపై దాఖలైన పిటిషన్ పై విచారణకు నిరాకరించింది సుప్రీంకోర్టు. ఈ క్రమంలో ఘాటైన వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు. కాశ్మీర్ అంశం చాలా సున్నితమైందని.. భద్రతా బలగాల నైతిక స్తైర్యాన్ని దెబ్బ తీయొద్దని పేర్కొంది సుప్రీంకోర్టు. మేము దర్యాప్తు చేసే అధికారులం కాదని పేర్కొంది ధర్మాసనం.పిటిషనర్ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మందలించింది సుప్రీంకోర్టు. దీంతో కోర్టు కేసు వెనక్కి తీసుకున్నాడు పిటిషనర్.

ఇది దేశ ప్రజలంతా ఒక్కటిగా నడవాల్సిన తరుణమని పేర్కొంది సుప్రీంకోర్టు. పహల్గామ్ ఉగ్రదాడి పై జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలని కోరుతూ దాఖలైన పిల్ ను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు.కాశ్మీర్‌లోని పర్యాటకుల రక్షణ కోసం కేంద్రం, జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వాలకు ఆదేశాలు ఇవ్వాలని కోరగా.. కేసు విచారణ జరిపిన జస్టిస్ సూర్యకాంత్ , జస్టిస్ ఎన్. కోటీశ్వర్ సింగ్‌లతో కూడిన ధర్మాసనం విచారణకు తిరస్కరించింది.